ఈఏడాది బిగ్గెస్ట్ మూవీస్ లో ఒకటి గా వస్తుంది కల్కి 2898ఏడి.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ తో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.రేపు రామోజీ ఫిలిం సిటీ లో ఓ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.ఇక ఈసినిమాకు ఓటిటి డీల్ కూడా క్లోజ్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కల్కి హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండగా దక్షిణాది భాషల హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.ఇందుకోసం నెట్ ఫ్లిక్స్ ,అమెజాన్ ప్రైమ్ భారీగా చెల్లించనున్నాయని సమాచారం.ఇక ఈసినిమా దాదాపు 700కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయనుందని టాక్.థియేట్రికల్ బిజినెస్ కూడా దాదాపు గా పూర్తయినట్లే.
రీసెంట్ గా సలార్ తో ప్రభాస్ మళ్ళీ ఫామ్ లోకి రావడం అలాగే స్టార్లు అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ ,దీపికా పదుకోణ్ నటిస్తుండడంతో కల్కికి భారీ ఆఫర్స్ వస్తున్నాయి.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈసినిమా వచ్చే నెల 27న థియేటర్లోకి రానుంది.ఇక తెలుగులో సంక్రాంతి తర్వాత వస్తున్నపెద్ద సినిమా ఇదే.మరి ఈసినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























