అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ఫై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఈ సినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్‍గా రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో నాగచైతన్య ఒక మత్స్యకారుడిగా కనిపించనున్నారు. తన కెరీర్‌లో చైతన్య ఇలా ఒక ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తుండటం ఇదే తొలిసారి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగచైతన్య ఓ జాలరి పాత్రలో కనిపించబోతుండగా, పల్లెటూరి అమ్మాయిగా సాయిపల్లవి నటిస్తోంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి అధికారులకు పట్టుబడ్డ భారత మత్స్యకారుల కథగా ఇది తెరకెక్కుతోంది.
దీంతో ఆయన ఈ పాత్రను ఒక సవాల్‌గా తీసుకుని నటిస్తున్నారు. దీనిలో భాగంగా సహజంగా కనిపించేందుకు మత్స్యకారుడి పాత్రకు తగట్టుగా చైతూ మేకోవర్ అవ్వడం విశేషం. ఇక కొద్దిరోజులక్రితం ‘ఎస్సెన్స్ అఫ్ తండేల్’ పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. దీంతో తండేల్ సినిమాపై ఇటు అభిమానుల్లో.. అటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు అక్కినేని ఫ్యాన్స్ ఈ చిత్రం నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
#Thandel pic.twitter.com/wlhOhtbBEn
— chaitanya akkineni (@chay_akkineni) May 22, 2024
ఈ నేపథ్యంలో అక్కినేని అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు హీరో నాగచైతన్య. తండేల్ నుంచి తాజాగా కొత్త స్టిల్ ఒకటి రిలీజ్ చేశారు. దీనిని చైతూయే స్వయంగా తన అధికారిక ఎక్స్‌లో షేర్ చేశారు. ఇందులో చైతన్య నిజమైన మత్స్యకారుడిగా కనిపిస్తున్నారు. ఒక బోట్‌పై చిరునవ్వులు చిందిస్తూ నిలబడి పెద్ద తాడును చేతులకు చుట్టుకుని వేటకు సిద్దమవుతున్నట్లుగా ఉన్నారు. ఈ స్టిల్ చూసిన ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా చైతన్య పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: