ధనుష్ రాయన్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

Peechu Mithaay Song Released From Rayan Movie

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘రాయ‌న్’. కాగా ధ‌నుష్ కెరీర్‌లో ఇది 50వ సినిమా కావడం విశేషం. అయితే మరో విశేషమేంటంటే..? ఈ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వ‌హిస్తున్నాడు. కాగా దర్శకుడిగా ఆయనకు ఇది రెండో సినిమా. అంతకుముందు 2017లో వచ్చిన ‘పా పాండి’ అనే సినిమాతో ధనుష్ తొలిసారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆయనకు ఉత్తమ దర్శకుడిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రాయన్‌లో ధనుష్ సరసన ‘ఆకాశం నీ హద్దురా’ (సూరారై పోట్రు – తమిళం) ఫేమ్ అప‌ర్ణ బాల‌ముర‌ళి క‌థ‌నాయిక‌గా నటిస్తోంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న రాయన్‌ నుంచి ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్, ఫస్ట్ సింగిల్ ‘ఎవరికి తలవంచడే’ విడుద‌ల చేయ‌గా.. మంచి అప్లాజ్ వచ్చింది.  ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. రాయన్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ పాటకు తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. విజయ్ ప్రకాష్, హరిప్రియ ఆలపించారు.

అయితే పోస్టర్ చూస్తుంటే.. ఇది సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి మధ్య ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. సందీప్ కిషన్ సైకిల్ తొక్కుతూ ఉంటే ముందు అపర్ణ బాల మురళి కూర్చుని ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. కాగా రాయన్ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్‌ కిషన్‌ మరో ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. కాళిదాస్‌ జయరామ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే దర్శక, నటుడు ఎస్‌జె సూర్య, ధుషార విజయన్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇంకా ధనుష్ సోదరుడు, ప్రముఖ దర్శక, నటుడు సెల్వ రాఘవన్‌ ఒక కీలక పాత్రలో కనిపించనుండటం గమనార్హం. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుస్తుండగా.. ఓం ప్రకాశ్‌ సినిమాటోగ్రాఫర్‌గా, పీటర్‌ హెయిన్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న రాయన్ సినిమా ఈ ఏడాది తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.