సుమన్ చిక్కాల దర్శకత్వంలో టాలీవుడ్ చందమామ కాజల్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సత్యభామ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుండగా.. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సత్యభామ టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు పెంచారు. మే 24వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా రానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ముందు మే17 అనుకున్నారు. అది కుదరలేదు. ఫైనల్ గా మే31వ తేదీన రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే మళ్లీ రిలీజ్ డేట్ మారనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆవార్తలే నిజమయ్యాయి. తాజాగా చిత్రయూనిట్ ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించాయి. జూన్ 7వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా ఈసినిమాలో ఇంకా నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ యద్మ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్కా స్క్రీన్‌ప్లేతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























