పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ.దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తయింది.పవన్ ఇన్ని రోజులు ఎలక్షన్స్ లో బిజీ గా ఉండడం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.ఇక ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ముగియడంతో జూన్ నుండి ఓజీ షూటింగ్ మళ్ళీ మొదలు కానుంది. ఇక ఈసినిమా ట్రైలర్ కట్ కూడా జరిగిపోయందట.ఫస్ట్ వెర్షన్ ట్రైలర్ ను అయితే రెడీ గా పెట్టుకున్నామని నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది.ఇంతకుముందు ఈసినిమా నుండి వచ్చిన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఈ ట్రైలర్ ఎలావుండనుందో అని పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ట్రైలర్ ను సినిమా విడుదలకు కొద్దీ రోజులు ఉందనగా వదలనున్నారు.గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమా లో పవన్, ఓజాస్ గంభీరా పాత్రలో కనిపించనున్నాడు. ప్రియాంక మెహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది.
ఇక పవన్ ఈసినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా పూర్తి చేయాల్సి వుంది. అందులో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు వున్నాయి. హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రానుండగా సంగం షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయ్యింది.ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ది కూడా సగం షూటింగ్ బ్యాలెన్స్ వుంది.పవన్ మొదట ఓజీని పూర్తీ చేసి తర్వాత భగత్ సింగ్ కోసం డేట్స్ ఇవ్వనున్నున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























