మెగాస్టార్ చిరంజీవి దానగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సేవా కార్యక్రమాలు చేయడంలో చిరు ఎప్పుడూ ముదుంటారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వారిలో చిరంజీవి ఒకరు. ఇప్పటివరకూ చిరు ఎన్నో దానాలు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. ఇక ఇప్పుడు మరోసారి తన ఉదారతను చూపించారు చిరు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీనియర్ జర్నలిస్టు ప్రభు గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అయితే ఇటీవల ఆయన మెడికల్ టెస్టులు చేయించుకోగా హార్ట్ లో 80% బ్లాకులు ఉన్నట్టు చెప్పి యాంజియో గ్రామ్ చేసి బైపాస్ సర్జరీ చేయాలి అన్నారు. అయితే ప్రభు చిరంజీవికి క్లోజ్ అవ్వడంతో సెకండ్ ఒపీనియన్ కోసం చిరంజీవిని సంప్రదించారు. దీంతో చిరంజీవి హైదరాబాద్ స్టార్ హాస్పటల్ డాక్టర్స్ కు ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేయించి ప్రభుని అడ్మిట్ చేయించారు. ఈనేపథ్యంలో చిరుకి సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియచేశారు.

ఇక గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాను అప్పుడే మొదలుపెట్టాడు. ఈసారి యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























