తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రస్తుతం 4 హిందీ , రెండు తమిళ , ఒక తెలుగు మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయం లో వేలాది మంది వలస కార్మికులకు ఆహారసదుపాయాన్ని రకుల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణం లో మరో మంచి పనికి రకుల్ శ్రీకారం చుట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మన దేశ ప్రజలు ప్రస్తుతం దుర్భర పరిస్థితులలో ఉన్నారనీ , ఆక్సిజన్ – బెడ్స్ – మెడిసిన్స్ కొరత కారణంగా ప్రజలు కరోనా తో తమ పోరాటం సాగించలేకపోతున్నారనీ , “గివ్ ఇండియా”తో నిధుల సమీకరణ ద్వారా తమ లక్ష్యం బాధితులకు ఆక్సిజన్ అందించడమే ననీ, ప్రత్యక్ష పొదుపు పరికరాల సరఫరాతో కింది స్థాయిలో ఆస్పత్రులకు మద్దతునిచ్చి ఉపశమనం కలిగించడమేననీ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ప్రజలంతా తమవంతు సాయం అందించాలనీ రకుల్ కోరారు. చిన్న మొత్తాలు కూడా చాలా మందికి సహాయపడతాయనీ , కరోనా బాధితులు నిస్సహాయంగా ఉన్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని తాను అభ్యర్థిస్తున్నాననీ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: