వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత వస్తున్న సినిమా వకీల్ సాబ్. హిందీ లో సూపర్ హిట్ అయిన పింక్ కు ఇది రీమేక్. తమిళ్ లో నెర్కొండ పార్వాయి సినిమా కూడా పింక్ రీమేకే. అక్కడ కూడా ఈసినిమా హిట్ అయింది. ఇప్పుడు తెలుగులో అందులోనూ పవన్ హీరో కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక రకంగా వకీల్ సాబ్ లో పవన్ కాబట్టే ఆసినిమాకు అంత హైప్ వచ్చింది. మరి ఒకవేళ వకీల్ సాబ్ పాత్రలో పవన్ కాకుండా వేరే హీరో అయితే.. ఇన్ని రోజులు వకీల్ సాబ్ గా పవన్ ను ఫిక్స్ అయ్యాం కాబట్టి మరొక హీరోను ఊహించుకోవడం కష్టమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు దీనికి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు శ్రీరామ్ ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. ఈసినిమా కోసం పవన్ కాకపోతే నాగార్జునను వకీల్ సాబ్ గా తీసుకునేవాడని చెప్పుకొచ్చాడు. నాగార్జున లాంటి హీరో కూడా ఈ రోల్ కు పర్పెక్ట్ గా సెట్ అవుతాడని.. నాగ్ లాంటి హీరో ఉన్నా కూడా కంటెంట్ పై ఫోకస్ చేయచ్చు.. అయితే ఎక్కువ ఎలిమెంట్స్ యాడ్ చేయాల్సిన పని ఉండదు.. నాకు అంత బర్డెన్ కూడా ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: