14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ బి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యం లో రూపొందిన “శ్రీకారం “మూవీ శివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీ రిలీజ్ కానుంది. సాయి కుమార్ , మురళీశర్మ , రావు రమేష్ , నరేష్ , ఆమని ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
“శ్రీకారం “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“శ్రీకారం “మూవీ గురించి హీరో శర్వానంద్ మాట్లాడుతూ .. వ్యవసాయ నేపథ్యంలో రూపొందిన “శ్రీకారం “మూవీ లో క్యూట్ లవ్ స్టోరీ ప్రేక్షకుల హృదయాలను టచ్ చేస్తుందనీ , హీరోయిన్ ప్రియాంక, తనకెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనీ చెప్పారు. హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ .. “శ్రీకారం “మూవీ రొటీన్ లవ్ స్టోరీ కాదనీ , హీరో తో ప్రేమలో పడిన తరువాత వ్యవసాయం పై అతనికి ఉన్న మక్కువ చూసి విలేజ్ కు వెళ్ళడానికి సిద్ధపడే క్యారెక్టర్ లో నటించాననీ , కేరింగ్ &స్వీట్ అంటూ శర్వానంద్ పై ప్రశంసలు కురిపించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: