ప్రస్తుతం నాగశౌర్య వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో వున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ప్రస్తుతం నాలుగైదు సినిమాలు నాగశౌర్య లిస్ట్ లో వున్నాయి. వాటిలో ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఈ రోజు నాగశౌర్య పుట్టిన రోజు కావడంతో వరుస సర్ప్రైజ్ లు ఇస్తున్నారు అభిమానులకు. తాజాగా తన కొత్త సినిమాకు సంబందించిన మరో అప్ డేట్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే గత కొద్దికాలంగా ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేదు. ఇక నేడు పుట్టినరోజు కావడంతో ఈ సినిమాపై కూడా క్లారిటీ వచ్చింది. ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ముందు నుండి అనుకుంటున్నట్టే పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.
Wishing our hero @IamNagashaurya A very Happy Birthday!! – Team #PhalanaAbbayiPhalanaAmmayi
Here’s a special birthday video▶️ https://t.co/x2Jc6YTGEc#HBDNagaShaurya#SrinivasAvasarala #MalavikaNair @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy #DasariProductions pic.twitter.com/4fX1TKg95d
— People Media Factory (@peoplemediafcy) January 22, 2021
దీనితో పాటు సంతోష్ జాగర్లపుడి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సినిమాతెరకెక్కుతుంది. లక్ష్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను ఇప్పటికే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ‘వరుడు కావలెను’ సినిమా చేస్తుండగా ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంతో పాటు రాజేంద్ర దర్శకత్వంలో ‘పోలీసు వారి హెచ్చరిక’ సినిమా చేస్తున్నాడు. ఇంకా ‘అలా ఎలా’ సినిమా దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలోనూ మరో సినిమా చేయనున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: