తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా , సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటో షూట్స్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం 3 తమిళ మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఒక తమిళ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాశీఖన్నా హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




తమిళ మూవీస్ తో బిజీగా ఉన్న రాశీఖన్నా మాట్లాడుతూ .. సినిమాలలో అభినయం పరంగా తప్పులుంటే సరిదిద్దుకుంటాననీ , చిత్ర సీమ లో ఆశ నిరాశలు కామన్ అనీ , అంతిమంగా కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందనీ , గ్లామర్ కథానాయిక ఇమేజ్ లో బందీ అవడం తనకు ఇష్టం లేదనీ , నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించాలని ఉందనీ , తన ప్రతిభ , సామర్ధ్యాల మీద విశ్వాసం ఉందనీ , తన కలలకు హద్దులు విధించుకోననీ , సినిమాలలోనే కాదు ప్రతిభ ఎక్కడవున్నా ప్రేక్షకులు ఆదరిస్తున్నారనీ , నటి గా తనలోని ప్రతిభను సంపూర్ణంగా ప్రదర్శించే మంచి రోజులకై ఎదురుచూస్తున్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: