నగరం, ఖైదీ చిత్రాల దర్శకుడు లొకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్టర్’. సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో విజయ్ ‘మాస్టర్’ సినిమా కూడా ఒకటని చెప్పొచు. ఎందుకంటే కేవలం తమిళ్ లోనే కాదు విజయ్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. కరోనా వల్ల థియేటర్స్ మూత పడటంతో సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకున్న ఈ సినిమా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు రిలీజ్ కు సిద్ధంగా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక మేకర్స్ కూడా ఈ సినిమా నుండి ఇప్పటివరకూ టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ కాలేదు. ఇక ఈ విషయంపై డైరెక్టర్ లోకేష్ మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ పై ఎలాంటి క్లారిటీ లేకుండా టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయలేము.. అయితే ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా కాస్త పాజిటివ్ గానే ఉన్నాము… ఇకనుండి రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇవ్వడానికి చూస్తాం.. అయితే విజయ్ ఫ్యాన్స్ కు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. వచ్చే ఏడాది పొంగల్ కు సినిమా రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టు తెలిపాడు.
కాగా ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోను కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా .. కాలేజ్ ప్రొఫెసర్ గా రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: