వైవిధ్యమైన సినిమాల్లో… విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేద థామస్. ఒక్కో మెట్టు ఎదుగుతూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం నివేదా నటించిన ‘వి’ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది. నాని, సుధీర్ బాబు, ఆదితిరావు హైదరిలతో కలిసి నివేదా ఈ సినిమాలో నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా నానితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నానితో ‘జెంటిల్ మెన్’, నిన్ను కోరి సినిమాలు చేసాను.. నానితో మంచి అనుబంధం ఏర్పడింది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ తను నాకు మంచి ఫ్రెండ్. నాకు ఏదైనా కథ నచ్చితే.. తనతో డిస్కస్ చేస్తుంటాను. అలాగే తన సినిమాల్లోని పాత్రలు గురించి నాతో డిస్కస్ చేస్తుంటాడు. నాని యాక్టర్‌గా ఓ పాత్రను ఒప్పుకున్నాడంటే దాన్ని తెరపై తీసుకు రావడానికి ఇంకా గొప్ప ప్రయత్నం చేస్తారు. తను చాలా విషయాల్లో నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చింది నివేదా. మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారేమో చూద్దాం.
ఇంకా సహా నటి రావు హైదరి గురించి మాట్లాడుతూ.. ఆదితి రావు హైదరి స్వీటెస్ట్
పర్సన్.. గొప్ప నటి. తనైనా, నేనైనా, మరేవరైనా మా పాత్రకు న్యాయం చేయాలనే ప్రయత్నించాం. గొప్పగా నటించడానికి ప్రయత్నించాం. అలా చేశాం కాబట్టే సినిమా బాగా వచ్చిందని చెప్పింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: