ఘాజీ, అంతరిక్షం లాంటి విభిన్నమైన కథలను తెరకెక్కించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఘాజీ సినిమా మంచి ఘన విజయం సాధించగా… అంతరిక్షం సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది. అయినా కూడా సంకల్ప్ రెడ్డి ఎక్కడా తగ్గకుండా మరో ప్రయోగానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈసారి కూడా మరో విభిన్నమైన కాన్సెప్ట్ తో రాబోతున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించి వాస్తవ ఘటనను ఆధారంగా చేసుకుని సంకల్ప్ రెడ్డి సినిమా తీయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడట సంకల్ప్ రెడ్డి. బాలీవుడ్ నటుడు విద్యుజమాల్ ఇందులో హీరోగా నటించనున్నారట. కరోనా ప్రభావం తగ్గి పరిస్థితులు కాస్త చెక్కబడిన తర్వాత షూటింగ్‌ను స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాడట. జమ్ము, కాశ్మీర్, కోల్‌కతా, ఢిల్లీలోని రియల్ లొకేషన్స్‌లోనే ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నారట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా ఇదిలా ఉండగా గతంలో అంటార్కిటికా నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి సినిమా చేయబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఓ తెలుగు ఎక్స్ ప్లోరర్ అంటార్కిటికా వెళ్లడం…అక్కడ రీసెర్చ్ సెంటర్ లో జాయిన్ కావడం..ఆ తరువాత అక్కడ అతను ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు వార్తలు వినిపించాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: