నన్ను ఇంప్రెస్ చేయాలంటే ఇలా చేయాలి..!

Actress Trisha Gives An Interesting Task To Her Fans
Actress Trisha Gives An Interesting Task To Her Fans

‘వర్షం’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన త్రిష మొదటి సినిమాతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకొని.. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ్ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే కొత్త హీరోయిన్స్ వల్ల ఆఫర్స్ కాస్త తగ్గినా తనకు వచ్చిన అవకాశాలని వినియోగించుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సినీ జీవితం గురించి పక్కన పెడితే.. త్రిష వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడు హాట్ టాపిక్కే. అందులో తన పెళ్లి, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు అయితే ఎప్పుడూ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ మధ్య ఎంగేజ్ మెంట్ అయి కూడా క్యాన్సిల్ అయింది ఈ భామకు. ఇక ప్రస్తుతం ఎలాంటి వివాదాలు లేకుండా ఒంటరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది త్రిష. అదేంటంటే… నేను చాలారోజులుగా ఎవ్వరితోనే డేటింగ్ చేయడం లేదు. మీకు నాపైన ఇంట్రెస్ట్ ఉంటే… ఓ 500 పదాలతో వ్యాసం రాయండి. మీరు నా సమయాన్ని వృథా చేయకుండా ఎలా చూసుకుంటున్నారో ఈ వ్యాసంలో వివరించి, ఇంప్రెస్ చేయండి’ అంటూ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. మరి ఇంకెందుకు లేట్ ఫ్యాన్స్.. ఆ వ్యాసం ఏదో రాసి త్రిషను ఇంప్రెస్ చేసేయండి.

ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేనప్పటికీ కోలీవుడ్‌లో ఐదు, మలయాళంలో ఓ సినిమా చేస్తూ బిజీగానే ఉంది. ఆచార్య లో త్రిషను తీసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =