మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ మూవీ `ఖైదీ నంబర్ 150`లో ఆడిపాడింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ఆ సినిమాలో ఆ ఇద్దరి జంట చూపరులకు కనులపంటగా నిలచింది. కట్ చేస్తే.. మూడేళ్ళ తరువాత ఈ ఇద్దరు మరోమారు జోడీకట్టనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ `ఆచార్య` పేరిట ఓ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరుకి జోడీగా తొలుత త్రిషని ఎంపిక చేశారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల తను `చిరు 152` నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది త్రిష.




ఈ నేపథ్యంలో.. త్రిష స్థానంలో ఎవరు నటిస్తారనే అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. లేటెస్ట్ బజ్ ప్రకారం… ఇప్పటికే `ఖైదీ నంబర్ 150`లో చిరుకి పెయిర్ గా అలరించిన కాజల్ సదరు పాత్రలో నటించబోతోందని వినిపిస్తోంది. అంతేకాదు… ఈ నెలాఖరు నుంచి తను చిత్రీకరణలో పాల్గొనే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరికొద్దిరోజుల్లో `చిరు 152`లో కాజల్ ఎంట్రీ ఇస్తుందో లేదో అన్న విషయంపై క్లారిటీ వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: