మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోపక్క ఈ సినిమా అప్ డేట్స్ అప్పుడప్పుడు ఇస్తూనే వున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లు రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో లుక్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజున వరలక్ష్మీ శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ‘క్రాక్’ సినిమాలో ‘జయమ్మ’గా వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రను పరిచయం చేస్తూ ఆమె ఫస్టులుక్ ను వదిలారు. ఆమె లుక్ చూస్తుంటే, గ్రామీణ నేపథ్యంలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రనే పోషిస్తున్నట్టుగా అనిపిస్తోంది.
Happy Birthday To Our Jayamma @varusarath 🔥
– Team #Krack@RaviTeja_offl @megopichand @shrutihaasan @thondankani @MusicThaman @TagoreMadhu #SaraswathiFilmsDivision @dop_gkvishnu @TheKrackMovie#KrackOnMay8th pic.twitter.com/0SQveYQ2I0— #Krack (@TheKrackMovie) March 5, 2020




ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మే 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ పక్కా మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు అర్థమైంది. మరి డాన్ శ్రీను, బలుపు తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో అయినా రవితేజ హిట్ కొడతాడేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: