`అజ్ఞాతవాసి` తరువాత క్రియాశీలక రాజకీయాలపై దృష్టి సారించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పవన్ రీ-ఎంట్రీ ఫిల్మ్ `వకీల్ సాబ్` మే 15న విడుదల అయ్యే దిశగా నిర్మాణం జరుపుకుంటోంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ఓ పిరియాడిక్ ఫిల్మ్ లోనూ ఈ కొణిదెల స్టార్ నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీని తొలుత దసరా బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, విజువల్ ఎఫెక్ట్స్ కి స్కోప్ ఉన్న సినిమా కావడంతో… వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




కాగా, 2021 సంక్రాంతి బరిలో ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న బడా మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` ఉన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో కథానాయకులుగా నటిస్తున్నారు. జనవరి 8న `ఆర్ ఆర్ ఆర్` విడుదల కానుంది. మరి… `పవర్ స్టార్ 27`కి ఏ తేదిని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేస్తారో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: