అభినయానికి అవకాశమున్న పాత్రల్లోనే నటిస్తూ.. ముందుకు సాగుతోంది నిత్యా మీనన్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం వంటి దక్షిణాది భాషల్లోనే కాదు.. హిందీనాట కూడా నటిగా తనదైన ముద్రవేసింది ఈ అభినేత్రి. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటిగా పేరు తెచ్చుకున్న ఈ కేరళకుట్టి.. త్వరలో ఓ తమిళ చిత్రం కోసం ఇప్పటివరకు ధరించని ఓ విలక్షణ భూమికను పోషించబోతోందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించనున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుందని సమాచారం. అంతేకాదు.. ధనుష్ పాత్రకి దీటుగా ఇందులో నిత్య పాత్ర ఉంటుందని తమిళ చిత్ర వర్గాలు తెలియజేస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇదిలా ఉంటే.. నిత్య తాజా తమిళ చిత్రం `సైకో` ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: