క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం రోజు ఫిబ్రవరి 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ లుక్స్ తో విజయ్ దేవరకొండ చూపించిన వేరియేషన్ బాగుంది. కొత్త ఏడాదిలో తొలి హిట్ కొడతాడేమో చూడాలి మరి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇదే తన లాస్ట్ లవ్ స్టోరీ అంటున్నాడు విజయ్ దేవరకొండ. అదేంటీ అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ… ఇదే తన చివరి లవ్ స్టోరీ అని చెప్పాడు. అందుకే తన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చానని చెప్పాడు. మరి ఇప్పటికే రెండు మూడు సినిమాలు ప్రేమ కథలే తీశాడు విజయ్. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. ఇక ముందు ముందు డిఫరెంట్ కథలతో వస్తాడేమో చూద్దాం.
[custom_ad]
కాగా ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా, ఇజబెల్లె నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: