ఒకే రోజు రెండు సినిమాలు విడుదల కావడం, అవి ఘనవిజయం సాధించడం చాలా అరుదుగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా… సంక్రాంతి సీజన్ లో రిలీజయ్యే సినిమాల్లో ఇది మరింత అరుదు. అలా… ఒకే రోజు (2004 జనవరి 14) జనం ముందుకొచ్చి జేజేలు అందుకున్న ఆ చిత్రాలే… `లక్ష్మీ నరసింహా`, `వర్షం`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
తమిళ చిత్రం `సామి` ఆధారంగా రూపొందిన `లక్ష్మీ నరసింహా`లో నటసింహా బాలకృష్ణ, అసిన్ జంటగా నటించగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించాడు. ఇక 1988 నాటి హిందీ బ్లాక్ బస్టర్ `తేజాబ్` ఛాయలతో తెరకెక్కిన `వర్షం`లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష జోడీగా నటించగా శోభన్ దర్శకత్వం వహించాడు. వీటిలో `లక్ష్మీ నరసింహా` ఆ యేటి మేటి హయ్యస్ట్ గ్రాసర్ గా రికార్డులకెక్కగా… `వర్షం` ఆ సంవత్సరంలో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రంగా నిలచింది. మొత్తమ్మీద ఒకే రోజు రిలీజైన రెండు సినిమాలు ఆ ఏడాది బెస్ట్ హిట్స్ గా నిలవడం అత్యంత అరుదైన విషయమనే చెప్పాలి. కాగా, నేటితో `లక్ష్మీ నరసింహా`, `వర్షం` చిత్రాలు పదహారేళ్ళు పూర్తిచేసుకుంటున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: