హృతిక్ రోష‌న్ తొలి చిత్రం ‘కహో నా ప్యార్ హై’కు 20 ఏళ్ళు

Hrithik Roshan Debut Movie Kaho Naa Pyaar Hai Completes 20 Years

క‌థానాయ‌కుడిగా న‌టించిన తొలి చిత్రంతోనే సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాకుండా స్టార్ డ‌మ్ ను కూడా సొంతం చేసుకోవ‌డం అనేది అతి త‌క్కువ మందికే సాధ్య‌మైంది. అలాంటి రేర్ ఫీట్ ని సాధించిన క‌థానాయ‌కుడిగా బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోష‌న్ కి భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేక స్థానం ఉంది. హృతిక్ కి అలా `డ్రీమ్ డెబ్యూ`గా నిల‌చి `ఓవ‌ర్ నైట్ స్టార్`గా మ‌ల‌చిన ఆ చిత్ర‌మే… `క‌హో నా ప్యార్ హై`. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే… ఈ చిత్రాన్ని హృతిక్ తండ్రి, మేటి ద‌ర్శ‌కుడు రాకేష్ రోష‌న్ రూపొందించారు. అంటే… తండ్రి నిర్దేశ‌క‌త్వంలోనే క‌థానాయ‌కుడిగా హృతిక్ తొలి అడుగులు ప‌డ్డాయ‌న్న‌మాట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

మ్యూజిక‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రంతో అమీషా పటేల్ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ కాగా… ఇతర ముఖ్య పాత్రల‌ను అనుపమ్ ఖేర్, ఆశిష్ విద్యార్థి, మొహ్నీష్ బేల్, ఫరీదా జలాల్, జానీ లీవ‌ర్ తదితరులు పోషించారు. రాకేష్ సోదరుడు రాజేష్ రోషన్ స్వరపరచిన బాణీలు సినిమాను మ‌రో స్థాయికి తీసుకువెళ్ళాయి. వాటిలో “కహో నా ప్యార్ హై”, “చాంద్ సితారే”, “ప్యార్ కీ కష్టీ మే హై”, “ఇక్ పల్ కా జీనా”, “నా తుమ్ జానో న హమ్”, “దిల్ నే దిల్ కో పుకారా”, “జానేమ‌న్ జానేమ‌న్‌” వంటి పాటలు చార్ట్ బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా “కహో నా ప్యార్ హై”, “దిల్ నే దిల్ కో పుకారా”, “ఇక్ పల్ కా జీనా” వంటి పాటల్లో హృతిక్ డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాదు… తొలిచిత్రంలోనే ద్విపాత్రాభిన‌యం చేసి మురిపించాడు హృతిక్‌. ఫిల్మ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప‌తాకంపై రాకేష్ రోషన్ స్వ‌యంగా నిర్మించిన ఈ చిత్రం అప్ప‌ట్లో ఘ‌న‌విజ‌యం సాధించడ‌మే కాకుండా… ప‌లు అవార్డుల‌ను కూడా సొంతం చేసుకుంది. 2000 జనవరి 14న విడుదలైన మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ ‘కహో నా ప్యార్ హై’… నేటితో 20 సంవత్సరాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 17 =