సూపర్ స్టార్ మహేష్ బాబు, లక్కీ హీరోయిన్ రష్మిక జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు ” మూవీ జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించగా రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ హరితేజ ముఖ్య పాత్రలలో నటించారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్
సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్, జిఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రూపొందిన “సరిలేరు నీకెవ్వరు ” మూవీలోని తన డబ్బింగ్ పార్ట్ ను మహేష్ బాబు నిన్న కంప్లీట్ చేశారు . న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కై మహేష్ బాబు తన ఫ్యామిలీ తో ముంబై కి ప్రయాణమయ్యారు. జనవరి మొదటి వారం లో మూవీ ప్రమోషన్స్ లో మహేష్ పాల్గొంటారు. ” సరిలేరు నీకెవ్వరు ” మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఎల్ బి స్టేడియం, హైదరాబాద్ లో మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా జనవరి 5వ తేదీ జరుగనుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: