రిలీజస్ ల్లో రిచ్ – రిజల్ట్స్ లో పూర్ 2019- రివ్యూ

Telugu FilmNagar Review About 2019 Telugu Movies

రో సంవత్సరం కాలగర్భంలో కరిగిపోయింది.. కలిసిపోయింది. చూస్తుండగానే 12 నెలలు 12 రోజులే
అన్నంత వేగంగా గడిచిపోయాయి. కొత్త సంవత్సరం, కొత్త దశాబ్దం ప్రారంభమవటానికి కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి.  ఈ నేపథ్యంలో గడిచిపోయిన 2019 లో తెలుగు చిత్ర పరిశ్రమ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి?వాటిలో ఎన్ని  విజయవంతమయ్యాయి? ఎన్ని పరాజయం పాలయ్యాయి? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి ఇత్యాది విశేషాలు, వివరాలతో కూడిన సమగ్ర సమీక్షను మీ ముందుకు తెస్తోంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం“.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెలవారీ రిలీజ్ లు, రిజల్ట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఓవరాల్ గా 2019లో తెలుగు చిత్ర పరిశ్రమ తీరుతెన్నులు ఏమిటి అని ప్రశ్నించుకుంటే చాలా  నిరాశాజనకమైన ఫలితాలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నిరుత్సాహపూరితమైన ఫలితాలు నిరుడెప్పుడూ రాలేదా అంటే … వచ్చాయి.

నిజానికి చరిత్ర పుటల్లో చిత్ర పరిశ్రమ సక్సెస్ రేట్  10 నుండి 15 శాతానికి మించి నమోదైన దాఖలాలు లేవు. ఇంత తక్కువ సక్సెస్ రేటుతో దశాబ్దాల వైభవాన్ని సొంతం చేసుకోవడం ఒక్క చిత్రపరిశ్రమకు మాత్రమే సాధ్యమైన విశేషం. జయాపజయాలకు అతీతమైన ప్రాభవాన్ని, ప్రభావాన్ని కొనసాగించగల ఏకైక ఇంద్రజాలం సినిమా అన్నది దశాబ్దాలుగా రుజువవుతూనే ఉంది. కాబట్టి చిత్ర పరిశ్రమ మనుగడకు దాని  జయాపజయాలకు సంబంధం లేదు. ఎన్ని విజయాలు వరించినా, ఎన్ని అపజయాలు ఎదురైనా చిత్ర నిర్మాణ యజ్ఞం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. గతించిన దశాబ్దాల చరిత్రకు అతీతంగా  2019లో కూడా దాదాపు 193 పైగా చిత్రాలు నిర్మితం కావటమే అందుకు నిదర్శనం. కాబట్టి సక్సెస్ పరంగా 10 శాతం విజయమే నమోదు అవుతున్నప్పటికీ సంఖ్యాపరంగా తెలుగు చిత్ర పరిశ్రమ సౌత్ ఇండియాలో టాపర్ గా, హోల్ ఇండియాలో రన్నరప్ గా తన స్థానాన్ని నిలుపుకుంటూనే  ఉంది.

అయితే సంఖ్యాపరంగా కనిపిస్తున్న ఫిగర్స్ చూసి సంబరపడిపోవడం కంటే సక్సెస్ విషయంలో మరీ  ఇంత తీసికట్టుగా తయారవటం బాధ కలిగిస్తుంది. ఒకవైపు పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్  అవుతుంటే ఒక్క సక్సెస్ కోసం నెలల తరబడి మొహం మొత్తిన్నట్టుగా చూడవలసిన పరిస్థితులు దాదాపు   ప్రతినెలలోనూ ఎదురయ్యాయి. ముఖ్యంగా 2019 తొలి త్రైమాసికంలో 50కిపైగా సినిమాలు రిలీజ్ అయితే ఎఫ్ 2 రూపంలో ఒకే ఒక ఘన విజయం,118 రూపంలో ఒక ఊరడింపు విజయం మాత్రమే సాధించగలిగింది టాలీవుడ్. ఇలా సంఖ్యకు- సక్సెస్ కు ఏ మాత్రం పొంతనలేని ఫలితాలతో సాగిన
2019 నెలలవారి విశ్లేషణ ఎలా ఉందో వివరంగా చూద్దాం.

జనవరి

1. 04-01-2019 – నటన
2. 04-01-2019 – భగవాన్
3. 04-01-2019 – అజయ్ పాసయ్యాడు
4. 04-01-2019 – రణరంగం
5. 04-01-2019 – కొత్త కుర్రాడు
6. 09-01-2019 – ఎన్టీఆర్ కథానాయకుడు
7. 11-01-2019 – వినయ విధేయ రామ
8. 12-01-2019 – ఎఫ్2
9. 25-01-2019 – మిస్టర్. మజ్ను
10. 25-01-2019 – కొత్తగా మా ప్రయాణం
11. 25-01-2019 – ముద్ర

ఇవీ – 2019 జనవరిలో విడుదలైన 11 సినిమాలు. సాధారణంగా సంక్రాంతి బరిలో నిలిచే  భారీ చిత్రాలలో అన్ని చిత్రాలు కుడి ఎడంగా గా విజయవంతం అవుతుంటాయి. సక్సెస్ రేంజ్ లో కొద్ది గొప్ప తేడాలు తప్ప అన్ని చిత్రాలు పర్వాలేదు అనే పర్ఫార్మెన్స్ ఇస్తాయి. కానీ 2019 జనవరిలో విడుదలైన భారీ అంచనాల భారీ చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ బాగా డిజప్పాయింట్ చేసాయి.

కంపేరిజన్ లో ఈ రెండింటి కంటే తక్కువ అంచనాలతో విడుదలైన “ఎఫ్ 2″ అంచనాలను మించిన విజయాన్ని సాధించి హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్ లోనే కాకుండా నిర్మాత దిల్ రాజు బ్యానర్
లోనే టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇక జనవరి 25న విడుదలైన మరో ఎక్స్పెక్టెడ్ ఫిలిం” మిస్టర్ మజ్ను” కూడా అంచనాలను అందుకోలేక పోయింది. దీంతో మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఎక్స్పెక్టేషన్స్ నాలుగింటిలో 3 ప్లాప్ కాగా మిగిలిన ఏడు సినిమాలు పూర్తిగా నిరుత్సాహపరిచాయి. మొత్తం మీద రెండు మూడు పెద్ద సినిమాలు, ఒకటో రెండో  చిన్న సినిమాలు విజయవంతమవుతూ సంక్రాంతి సీజన్లో శుభారంభాన్ని పొందే చిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం ఒకే ఒక్క విజయంతో సరిపుచ్చుకోవలసి వచ్చింది.

ఫిబ్రవరి

1 01-02-2019 – బిచ్చగాడా మజాకా
2 01-02-2019 – సకల కళా వల్లభుడు
3 01-02-2019 – గేమర్
4 01-02-2019 – అక్కడొకడుంటాడు
5 01-02-2019 – రహస్యం
6 08-02-2019 – నేనే ముఖ్యమంత్రి
7 08-02-2019 – అమావాస్య
8 08-02-2019 – యాత్ర
9 08-02-2019 – ఎమ్6
10 08-02-2019 – ఉన్మాది
11 22-02-2019 – ఎన్టీఆర్ మహానాయకుడు
12 22-02-2019 – మిఠాయి
13 22-02-2019 – 4 లెటర్స్
14 22-02-2019 – ప్రేమెంత పనిచేసే నారాయణ
15 22-02-2019 – యాక్సిడెంట్

జనవరిలో అగ్రతారల భారీ చిత్రాల పోటీకి భయపడి రిలీజ్ లు పోస్ట్ ఫోన్ చేసుకునే చిన్న నిర్మాతలందరూ ఫిబ్రవరిలో క్యూ కట్టడం జరుగుతుంది. అందుకే సినిమాకు బ్యాడ్ సీజన్ అయినప్పటికీ ఫిబ్రవరిలో సంఖ్యాపరంగా ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతాయి. ఆ ప్రకారంగానే 2019 ఫిబ్రవరిలో అత్యధికంగా 15 చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమైన “యాత్ర”కు ఒక మోస్తరు ఊరడింపు విజయం దక్కగా మిగిలిన 14 చిత్రాలు పూర్తి నిరాశకు గురిచేశాయి. అయితే మరో దివంగత ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన బయోపిక్” ఎన్టీఆర్ మహానాయకుడు” బాక్సాఫీస్ పరంగా ఫెయిల్ అయినప్పటికీ అందులో నందమూరి బాలకృష్ణ నటనకు అద్భుత ప్రశంసలు దక్కాయి.

మార్చి

1 01-03-2019 – 118
2 01-03-2019 – క్రేజీ క్రేజీ ఫీలింగ్
3 08-03-2019 – మరో అడుగు మార్పు కోసం
4 15-03-2019 – మౌనమే ఇష్టం
5 15-03-2019 – బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్
6 15-03-2019 – మ్యాగ్నెట్
7 15-03-2019 – మనసా వాచా
8 15-03-2019 – అశోక్ రెడ్డి
9 15-03-2019 – కాలేజ్ పోరగాళ్ళు
10 15-03-2019 – జెస్సీ
11 15-03-2019 – ప్రాణం ఖరీదు
12 15-03-2019 – వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ..?
13 15-03-2019 – ఏ నిమిషం
14 21-03-2019 – చీకటి గదిలో చితక్కొట్టుడు
15 21-03-2019 – ప్రేమతో చెప్పనా
16 22-03-2019 – చెడ్డీ గ్యాంగ్
17 22-03-2019 – అదృశ్యం
18 22-03-2019 – వినరా సోదర వీర కుమారా
19 22-03-2019 – సమయం
20 22-03-2019 – కమల్
21 28-03-2019 – వనం
22 29-03-2019 – సూర్యకాంతం
23 29-03-2019 – లక్ష్మీస్ ఎన్టీఆర్
24 29-03-2019 – ప్రేమ అంత ఈజీ కాదు

ఏప్రిల్  నెల పూర్తిగా పరీక్షల సీజన్ కావటంతో  సహజంగానే మార్చి లో రిలీజ్ లు  వెల్లువెత్తుత్తాయి. అందుకే 2019 మార్చి లో అత్యధికంగా 24 సినిమాలు విడుదలయ్యాయి. దీంతో సంఖ్యాపరంగా 2019 టాప్ మంత్ గా నిలిచింది మార్చ్. అయితే రిజల్ట్ పరంగా కూడా the most disastrous month of the year గా నిలిచింది మార్చ్. ఈ నెల ప్రారంభంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కె.వి.గుహన్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మించిన 118 చిత్రం ఒక్కటే సేఫ్ ప్రాజెక్టుగా నిలిచింది. సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన” లక్ష్మీస్ ఎన్టీఆర్” కొద్దిపాటి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ అవి నిలవలేదు. ఇక మిగిలిన 23  సినిమాల పరిస్థితి షరా మామూలే.

ఏప్రిల్

1. 05-04-2019 – మజిలీ సాహు గారపాటి అండ్ హరీష్ పెద్ది
2. 06-04-2019 – ప్రేమ కథా చిత్రమ్2 ఆర్.సుదర్శన్ రెడ్డి
3. 06-04-2019 – ప్రశ్నిస్తా పి.సత్య రెడ్డి
4. 12-04-2019 – చిత్రాంజలి వై. రవిశంకర్, సివి మోహన్ ప్రసాద్, యర్నేని నవీన్
5. 12-04-2019 – రుణం బి.సురేష్
6. 19-04-2019 – జెర్సీ సూర్యదేవర నాగవంశీ
7. 20-04-2019 – ఆనంద్ బాగ్ జి.వి సుబ్రహ్మణ్యం
8. 26-04-2019 – మేరా భారత్ మహాన్ వై.శ్రీధర్ రాజు
9. 26-04-2019 – డేంజర్ లవ్ స్టోరీ ఏ.గోపాల్
10. 26-04-2019 – దిక్సూచి ఎస్.రామలక్ష్మి
11. 26-04-2019 – దుప్పట్లో మిన్నాగు సి. ఈశ్వర ప్రసాద్ (అమర్)

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సమయమైన ఏప్రిల్ సినిమా రంగానికి కూడా పరీక్షా సమయం అనే చెప్పాలి. ఈ మాసంలో హిట్ రావటం చాలా అరుదు. ఏప్రిల్ మొదటి వారం లోనే పరీక్షల అవరోధాన్ని అధిగమిస్తూ నాగ చైతన్య సమంతల కాంబినేషన్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన  “మజలీ ” మంచి విజయాన్ని అందుకుంది. అలాగే వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న  సాయిధరమ్ తేజ్ కు దర్శకుడు కిషోర్ తిరుమల ” చిత్రలహరి” రూపంలో ఒక డీసెంట్ సక్సెస్ ను అందించాడు. ఇక నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రానికి ప్రశంసల స్థాయిలో రెవెన్యూ రాలేదు. మొత్తానికి 11 రిలీజ్ లు ఉన్న ఏప్రిల్ నెలలో రెండు సక్సస్ లు మాత్రమే చూడగలిగింది టాలీవుడ్.

మే

1 03-05-2019 – నువ్వు తోపురా
2 03-05-2019 – ఒక్కటే లైఫ్
3 03-05-2019 – రంగుపడుద్ది
4 09-05-2019 – మహర్షి
5 17-05-2019 – రొమాంటిక్ క్రిమినల్స్
6 17-05-2019 – ఎంతవారలైనా
7 17-05-2019 – మాస్ పవర్
8 17-05-2019 – స్వయం వధ
9 17-05-2019 – ఏబీసీడీ
10 24-05-2019 – సీత
11 24-05-2019 – లిసా
12 24-05-2019 – ఎవడు తక్కువ కాదు
13 31-05-2019 – ఆర్.రవీంద్రన్
14 31-05-2019 – ఫలక్ నుమా దాస్
15 31-05-2019 – డిసెంబర్-31st

మే నెల సినిమా వాళ్లకు మంచి అచ్చొచ్చిన నెల అంటారు. స్కూల్స్, కాలేజీలకు సెలవులు కావడంతో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ గా థియేటర్లకు క్యూ కడతారు స్టూడెంట్స్. అందుకే ఈ నెలలో రిలీజ్ లు ఎక్కువగా ఉంటాయి అంటానికి నిదర్శనంగా ఈ నెలలో మొత్తం 15 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే సక్సెస్ పరంగా  చూసుకుంటే మహేష్ బాబు 25వ చిత్రం “మహర్షి” ఒక్కటే ఘన విజయాన్ని సాధించింది. జనవరిలో విడుదలైన ఎఫ్ 2 తరువాత ఇండస్ట్రీకి ఊరటనిచ్చిన ఘనవిజయం ‘మహర్షి’ మాత్రమే. ఇక మే చివరిలో విడుదలై కాంట్రవర్షియల్ హిట్ గా నిలిచిన చిత్రం” ఫలక్నుమా దాస్”. ఇలా నెల మొత్తం మీద 15 చిత్రాలు విడుదల అయినప్పటికీ ప్రారంభంలో ఒక సూపర్ హిట్టు చివరిలో ఒక మినీ హిట్ తో 2019 మే కొంత ఊరటనిచ్చింది.

జూన్

1. 06-06-2019 – సెవెన్(7)
2. 06-06-2019 – హిప్పీ
3. 14-06-2019 – ఈకే
4. 14-06-2019 – గేమ్ ఓవర్
5. 14-06-2019 – వజ్ర కవచధర గోవిందా
6. 14-06-2019 – విశ్వామిత్ర
7. 14-06-2019 – సిబిఐ వర్సెస్ లవర్స్
8. 21-06-2019 – ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
9. 21-06-2019 – మల్లేశం
10. 21-06-2019 – ఫస్ట్ ర్యాంక్ రాజు
11. 21-06-2019 – ఓటర్
12. 21-06-2019 – స్పెషల్
13. 21-06-2019 – స్టువర్ట్ పురమ్
14. 28-06-2019 – బ్రోచేవారెవరురా
15. 28-06-2019 – కల్కి
16. 28-06-2019 – ప్రేమ జంట
17. 28-06-2019 – కెప్టెన్ రాణా ప్రతాప్

ప్రధమార్ధనికి చివరి మాసమైన జూన్ నెలలో స్కూల్స్, కాలేజీల రీఓపెనింగ్ హడావుడి ఉన్నప్పటికీ సినిమాలకు మాత్రం సమయాన్ని, డబ్బును కేటాయించే మైండ్ సెట్ లో ఉంటారు ప్రేక్షకులు. అందుకే ఈ నెలలో కూడా సినిమాలు అధిక సంఖ్యలో రిలీజ్ అవుతుంటాయి. సంఖ్యాపరంగా మార్చి తరువాత అత్యధికంగా 17 సినిమాలు రిలీజ్ అయిన నెల జూన్. అయితే సక్సెస్ పరంగా చూసుకుంటే ఈ నెలలో కూడా నిరుత్సాహకరమైన ఫలితాలు వచ్చినప్పటికీ రెండు చిత్రాలు ఆ నిరుత్సాహం మొత్తాన్ని పారద్రోలాయి. “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”, “బ్రోచేవారెవరురా” చిత్రాల అనూహ్య విజయం చిత్ర పరిశ్రమలో కొత్త జోష్ నింపింది. అవుట్ అండ్ అవుట్ డైరెక్టర్స్ ఫిలిమ్స్ గా అభినందించ బడిన ఈ రెండు చిత్రాల ద్వారా యువ దర్శకులు ఆర్ ఎస్ జె స్వరూప్, వివేక్ ఆత్రేయలు ఒక సరికొత్త ఒరవడిని  క్రియేట్ చేశారనే చెప్పాలి.  అలాగే చేనేత కార్మికుల జీవన నేపథ్యంలో రాజ్  దర్శకత్వంలో రూపొందిన “మల్లేశం”చిత్రానికి అద్భుతం ప్రశంసలు లభించాయి. మొత్తానికి జూన్ లో విడుదలైన 17 చిత్రాల్లో  రెండు మాత్రమే విజయాన్ని సాధించగా మిగిలిన 15 చిత్రాలు పరాజయం పాలు కావడం బాధాకరం.

జులై

1. 05-07-2019 – బుర్ర కథ
2. 05-07-2019 – దుర్మార్గుడు
3. 05-07-2019 – ఓబేబీ
4. 05-07-2019 – కాకతీయుడు
5. 12-07-2019 – మార్కెట్లో ప్రజాస్వామ్యం
6. 12-07-2019 – కే.ఎస్100
7. 12-07-2019 – మాయ బజార్
8. 12-07-2019 – దొరసాని
9. 12-07-2019 – నిను వీడని నీడని నేనే
10. 12-07-2019 – రాజ్ దూత్
11. 18-07-2019 – ఇస్మార్ట్ శంకర్
12. 26-07-2019 – డియర్ కామ్రేడ్
13. 26-07-2019 – నేను లేను
14. 26-07-2019 – బైలాంపుడి
15. 27-07-2019 – శివరంజని

జూలై లో కూడా లెక్కకు 15 చిత్రాలు విడుదలై నప్పటికీ సక్సెస్ దక్కింది రెండు చిత్రాలకు మాత్రమే. లేడీ డైరెక్టర్ నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్ పోషించిన ‘ఓ బేబీ’ మంచి విజయాన్ని సాధించగా , సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్- డైనమిక్ హీరో రామ్ కాంబినేషన్లో వచ్చిన ” ఇస్మార్ట్ శంకర్” మంచి బాక్సాఫీస్ హిట్ అయింది. ఇక ఈ నెలలో హై ఎక్స్ పెక్టేషన్స్ తో విడుదలైన విజయ్ దేవరకొండ  ” డియర్ కామ్రేడ్” అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మిగిలిన 12 సినిమాలు కూడా   కమర్షియల్ గా బాగా డిసప్పాయింట్ చేసాయి.

ఆగష్ట్

1. 02-08-2019 – గుణ369
2. 02-08-2019 – రాక్షసుడు
3. 09-08-2019 – కథనం
4. 09-08-2019 – మన్మథుడు2
5. 10-08-2019 – కొబ్బరిమట్ట
6. 15-08-2019 – ఎవరు
7. 15-08-2019 – రణరంగం
8. 15-08-2019 – సోగ్గాడే శోభన్ కృష్ణ
9. 23-08-2019 – కౌసల్య కృష్ణ మూర్తి
10. 23-08-2019-  బాయ్
11. 23-08-2019 – నివాసి
12. 23-08-2019 – ఏదైనా జరగొచ్చు
13. 23-08-2019 – హవా
14. 23-08-2019 – నోతోనే హాయి.. హాయి
15. 23-08-2019 – నేనే కేడి నెం.1
16. 30-08-2019 – సాహో
17. 31-08-2019 – దోషం

ఇక సంఖ్యాపరంగా ఆగస్టులో కూడా 16 సినిమాలు విడుదల అయినప్పటికీ ఫలితాలు షరా మామూలే. అయితే పెద్దంతగా  అంచనాలు లేని రాక్షసుడు, కొబ్బరి మట్ట, ఎవరు చిత్రాలు వాటి రేంజికి తగిన విజయాలు సాధించగా హయ్యస్ట్ ఎక్స్పెక్టేషన్ ల పాన్ ఇండియా ఫిలిం” సాహో ”  బాగా డిజప్పాయింట్ చేసింది. అయితే ఈ సినిమా సౌత్ ఇండియా వెర్షన్స్ డిజప్పాయింట్ చేసినప్పటికీ నార్త్ లో సాహో పెద్ద హిట్ కావటం విశేషం. మిగిలిన 13 సినిమాలలో ‘మహిళా క్రికెట్ – వ్యవసాయం’  నేపథ్యంలో రూపొందిన “కౌసల్య కృష్ణమూర్తి” కి కొన్ని వర్గాల ప్రసంశలు మాత్రమే దక్కాయి. మొత్తానికి 16 రిలీజ్ ల ఆగస్టులో మూడు సినిమాల బొటాబొటీ విజయం పరిశ్రమకు కొంత ఊరటనిచ్చింది.

సెప్టెంబర్

1. 06-09-2019 – దర్పణం
2. 06-09-2019 – 2 హౌస్ లవ్
3. 06-09-2019 – నీకోసం
4. 06-09-2019 – ఉండిపోరాదే
5. 06-09-2019 – జోడి
6. 13-09-2019 – నానీస్ గ్యాంగ్ లీడర్
7. 13-09-2019 – మార్షల్
8. 20-09-2019 – వాల్మీకి (గద్దల కొండ గణేష్)
9. 20-09-2019 – నేను నా నాగార్జున
10. 20-09-2019 – ఆర్గాన్స్
11. 21-09-2019 – పండుగాడి ఫొటో స్టూడియో
12. 27-09-2019 – రామ చక్కని సీత
13. 27-09-2019 – బడుగు జీవులు
14. 27-09-2019 – నిన్ను తలచి
15. 27-09-2019 – రాయలసీమ లవ్ స్టోరీ
16. 27-09-2019 – మిర్రర్

ఆగస్టు తరువాత  వరుసగా రెండవసారి సెప్టెంబర్ లో కూడా 16 రిలీజ్ లు నమోదు కావడం విశేషం. అయితే సక్సెస్ విషయంలో ఆగస్టుతో పోటీ పడలేకపోయింది సెప్టెంబర్. ఆగస్టులో  రాక్షసుడు, కొబ్బరి మట్ట, ఎవరు చిత్రాల పర్ఫార్మెన్స్ బాగుండగా ఆగస్టులో గద్దల కొండ గణేష్    (వాల్మీకి) ఒక్కటే ఓకే అనిపించింది. అయితే ఆ సినిమా మీద ఉన్న అంచనాలకు ఆ విజయం సరితూగదు. అలాగే నాని గ్యాంగ్ లీడర్ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. చిన్న సినిమా “ఉండిపోరాదే”కు మాత్రం కొద్దిపాటి ప్రశంసలు దక్కాయి. అలాగే జై రాజా సింగ్ దర్శకత్వంలో శ్రీకాంత్  ప్రధాన పాత్ర పోషించిన ” మార్షల్” చిత్రానికి కూడా మేకింగ్ అండ్ కంటెంట్ పరంగా మంచి ప్రశంసలు లభించాయి కానీ ఆర్థికంగా బాగా డిసప్పాయింట్ చేసింది. మొత్తం మీద సినిమాకు మంచి సీజన్ అయినప్పటికీ సెప్టెంబర్ లో చెప్పుకోదగ్గ విజయం లేదనే చెప్పాలి.

అక్టోబర్

1. 02-10-2019 – సైరా నరసింహా రెడ్డి
2. 05-10-2019 – ఊరంతా అనుకుంటున్నారు
3. 05-10-2019 – గోపీచంద్ చాణక్య
4. 08-10-2019 – ఎవరికీ చెప్పొద్దు
5. 11-10-2019 – ఆర్డీఎక్స్ లవ్
6. 18-10-2019 – రాజు గారి గది3
7. 18-10-2019 – మళ్ళీ మళ్ళీ చూశా
8. 18-10-2019 – ఆపరేషన్ గోల్డ్ ఫిష్
9. 18-10-2019 – కృష్ణా రావు సూపర్ మార్కెట్
10. 18-10-2019 – సరోవరం
11. 25-10-2019 – వనవాసం
12. 25-10-2019 – తుపాకీ రాముడు

అక్టోబర్ లో మొత్తం 12 సినిమాలు విడుదల కాగా మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ “సైరా నరసింహారెడ్డి” తెలుగు వెర్షన్ మాత్రమే విజయవంతమైంది. పాన్ ఇండియా ప్లానింగ్ తో విడుదలైన ఈ హై బడ్జెట్ పేట్రియాటిక్ సినిమాకు ప్రశంసలు దక్కిన స్థాయిలో  కమర్షియల్ సక్సెస్ దక్కలేదు. అయితే తెలుగు వెర్షన్ వరకు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్ గా  నిలవటం  విశేషం.  ఇక ఈ నెలలో విడుదలైన మిగిలిన 12 సినిమాల ఫలితం షరా మామూలే.

నవంబర్

1. 01-11-2019 – మీకు మాత్రమే చెప్తా
2. 01-11-2019 – ప్లానింగ్
3. 01-11-2019 – శ్రీమతి 21ఎఫ్
4. 01-11-2019 – గోర్ జీవన్
5. 01-11-2019 – ఆవిరి
6. 07-11-2019 – ఏడు చేపల కథ
7. 08-11-2019 – తిప్పరా మీసం
8. 08-11-2019 – కోనాపురంలో జరిగిన కథ
9. 08-11-2019 – అగ్లీ
10. 08-11-2019 – 4 ఇడియట్స్
11. 08-11-2019 – గాలిపురం జంక్షన్
12. 08-11-2019 – శివలింగాపురం
13. 19-11-2019 – తెనాలి రామకృష్ణ బి.ఏ.బి.ఎల్
14. 22-11-2019 – రాగల 24 గంటల్లో
15. 22-11-2019 – తోలు బొమ్మలాట
16. 22-11-2019 – జార్జి రెడ్డి
17. 22-11-2019 – బీచ్ రోడ్ చేతన్
18. 22-11-2019 – పిచ్చోడు
19. 22-11-2019 – ట్రాప్
20. 29-11-2019 – రణస్థలం
21. 29-11-2019 – రఘుపతి వెంకయ్య నాయుడు
22. 29-11-2019 – రాజా వారు- రాణి వారు
23. 29-11-2019 – అర్జున్ సురవరం

24 రిలీజ్ లు కలిగిన మార్చి తరువాత అత్యధికంగా 23 రిలీజ్ లతో సంఖ్యాపరంగా సెకండ్ ప్లేస్ లో నిలుస్తుంది నవంబర్. రిజల్ట్ విషయంలో కూడా దాదాపు మార్చి లాగానే నిరుత్సాహపరిచింది. అయితే మాసాంతంలో లో విడుదలైన “అర్జున్ సురవరం” ఒక మోస్తరు విజయాన్ని సాధించడంతో పాటు ఇంతకుముందు నవంబర్ 22 న విడుదలైన క్యాంపస్ బయోగ్రఫీ “జార్జి రెడ్డి” కి  మంచి ప్రశంసలు దక్కటం ఈ నెలలో దొరికిన ఊరటగా అనుకోవాలి. ఆ రెండు విశేషాలు తప్పితే నవంబర్ ను కూడా వెరీ వెరీ డిజాస్టరస్ మంత్ గా చెప్పక తప్పదు.

డిసెంబర్

1. 06-12-2019 – భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు
2. 06-12-2019 – మిస్ మ్యాచ్
3. 06-12-2019 – వజ్రాల వేట
4. 06-12-2019 – మేరా దోస్త్
5. 06-12-2019 – 90ఎమ్ఎల్
6. 06-12-2019 – అశ్వమేథం
7. 06-12-2019 – కలియుగ
8. 12-12-2019 – అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు
9. 13-12-2019 – అయ్యప్ప కటాక్షం
10. 13-12-2019 – వెంకీమామ
11. 13-12-2019 – హేజా
12. 20-12-2019 – రూలర్
13. 20-12-2019 – ప్రతిరోజూ పండగే

డిసెంబర్లో ఈరోజు (24) వరకు 13 చిత్రాలు విడుదలయ్యాయి. కాగా మొదటి రెండు వారాలలో విడుదలైన 11 చిత్రాలలో “వెంకీ మామ” ఒక్కటే విజయవంతంగా మిగిలిన పది చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి. ఇక మూడో వారంలో విడుదలైన నందమూరి బాలకృష్ణ “రూలర్” మంచి ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ రన్  విషయంలో కొంత వెనుకబడింది. ఈ సినిమా పూర్తిస్థాయి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో  వేచి చూడాలి.
ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన  “ప్రతి రోజు పండగే” ఓపెనింగ్స్ తో పాటు మంచి కలెక్షన్లు వసూలు చేస్తుంది. వరుస పరాజయాలతో డీలా పడిన సాయిధర్మ తేజ కు ఈ సంవత్సరం చిత్రలహరి, ప్రతి రోజు పండగే వంటి రెండు వరుస విజయాలు దక్కటం విశేషం. ఇక డిసెంబర్ చివరి వారంలో విడుదల కానున్న ఇద్దరి లోకం ఒకటే, మత్తు వదలరా, హీరో హీరోయిన్, స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, సాఫ్ట్ వేర్ సుధీర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో డిసెంబర్ చివరి వారంలో విడుదల కానున్న 5 చిత్రాలతో కలుపుకొని మొత్తం 18 చిత్రాలు విడుదల అవుతుండగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వారి జాబితా ప్రకారం మొత్తం 2019లో స్త్రైట్ చిత్రాల సంఖ్య 193 అవుతుంది. కాగా 2011 నుండి ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో 194 స్ట్రైట్ చిత్రాలు విడుదలైన 2014 తరువాత 193 చిత్రాలతో 2019 ద్వితీయ స్థానంలో నిలిచింది.

2011లో 120, 2012లో 127, 2013లో 178, 2014లో 194, 2015లో 172, 2016లో 181, 2017 లో 177, 2018లో 171, 2019లో 193 చిత్రాలు విడుదలైనట్లుగా చలన చిత్ర నిర్మాతల మండలి లెక్కలు చెబుతున్నాయి.

కాగా 2019 లో  193 చిత్రాలు విడుదల కావటం సంఖ్యాపరంగా ఆనందించదగ్గ విశేషమే అయినప్పటికీ సక్సెస్ పరంగా చూసుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది.  ఈ 193 చిత్రాలలో కేవలం 15 నుండి 18 చిత్రాలు మాత్రమే కొంచెం కుడి ఎడంగా విజయవంతం కాగా దాదాపు  175 చిత్రాలు దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. నిజానికి ప్లాప్ అవ్వాలని ఎవరూ సినిమాలు తీయరు. సినిమాలు తీసే ప్రతి ఒక్కరి లక్ష్యం విజయమే. మరి ఎందుకు ఇన్ని అపజయాలు ఎదురవుతున్నాయి? విజయవంతమైన ఆ కొద్ది మంది నిర్మాతలలో ఔత్సాహిక నూతన నిర్మాతలు ఇద్దరో ముగ్గురో ఉంటారు. సీజన్డ్ ప్రొడ్యూసర్స్ ఒక పది మంది ఉంటారు. కాగా కోట్లు పోగొట్టుకున్న మిగిలిన వారంతా సినిమా అనే గ్లామర్ గ్లోబ్ పట్ల అభిమానంతో, ఆకర్షణతో వచ్చిన వారే. నిజానికి సినిమా ఇండస్ట్రీ అన్నది బతికి బట్ట కడుతుంది అంటే దానికి కారణం ఈ నూతన ఔత్సాహిక నిర్మాతలే. వాళ్లకు కోట్ల లాభాలు అవసరం లేదు. వాళ్లకు విజయం చేకూరితే తిరిగి పరిశ్రమలోనే ఇన్వెస్ట్ చేస్తారు. కానీ  ఏడాదికి 150 మందికి పైగా నూతన నిర్మాతలు నలిగి నాశనం అవుతుంటే భవిష్యత్తులో చిత్ర పరిశ్రమ ఉత్పాదక సామర్థ్యం దారుణంగా పడిపోతుంది. పెట్టుబడుల కోసం ప్రతి రంగము ఔత్సాహికులను ఆహ్వానిస్తుంది. కానీ తమకై తాము ఆకర్షణతో వచ్చే ఔత్సాహిక నిర్మాతలను తరిమికొట్టే స్థాయిలో ఫలితాలు వస్తుంటే ఈ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరం లేదా?. కేవలం నూతన నిర్మాతల అవగాహనా రాహిత్యమే కాదు… చిత్ర పరిశ్రమలోని విధి విధానాలు కూడా ఇలాంటి దారుణ ఫలితాలకు కారణమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అప్పుడే నిర్మాణాలతో పాటు విజయాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఏది ఏమైనా 2019 నాటి దారుణ ఫలితాలు పునరావృతం కాకూడదని కోరుకుందాం… కొత్త సంవత్సరానికి, నూతన దశాబ్దానికి ఆశావహ స్వాగతం పలుకుదాం.

ప్రభు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.