హీరో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “ప్రతి రోజూ పండగే ” మూవీ పాజిటివ్ టాక్ తో ప్రేక్షకాదరణ పొందింది. రికార్డ్ కలెక్షన్స్ తో సాయి ధరమ్ తేజ్ సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సత్యరాజ్, రావు రమేష్ క్యారెక్టర్స్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి. థమన్ ఎస్ సంగీతం చిత్ర విజయానికి తోడ్పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ మూవీ పై హైప్ క్రియేట్ చేశాయి. “ప్రతి రోజూ పండగే ” మూవీ టీమ్ పై స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రశంసలు కురిపించారు. కజిన్ సాయి ధరమ్ తేజ్ ఒక మంచి హిట్ అందుకొన్నందుకు సంతోషంగా ఉందని, మిత్రుడు మారుతి విజయం సాధించారని, తన లైఫ్ లైన్ వాసు ఖాతా లో మరొక మంచి చిత్రమని, తన ఫాదర్ అల్లు అరవింద్ లాభాలు పొందారని , యు వి క్రియేషన్స్ కు అభినందనలని , సంగీత దర్శకుడు థమన్ బ్యాంక్ లో మరొక మంచి ఆల్బమ్ అని, టీమ్ కు అభినందనలు తెలుపుతూ అల్లుఅర్జున్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: