లేడీ ఓరియెంటెండ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే మొదట వినిపించే పేరు అనుష్క. అరుంధతి నుండి ఇప్పటివరకూ పలు లేడీ [ప్రాధాన్యత వున్న సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో `నిశ్శబ్దం` అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 31న రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో యాక్షన్ కథకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. స్వీటీతో వర్క్ చేయబోయే దర్శకుడు మరెవరో కాదు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో మంచి ఫీల్ ని కలిగించే డైరెక్టర్ గౌతమ్ మీనన్. గౌతమ్ కథ చెప్పగానే అనుష్క వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇక సినిమానుని జనవరి నుంచి పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు… మిలటరీ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇదని… స్వీటీ స్వయంగా పోరాట ఘట్టాల్లో పాల్గొంటుందని టాక్. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమాతో అయినా గౌతమ్ కు మంచి సక్సెస్ వస్తుందేమో…
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: