నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న రిలీజ్ అయిన ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో హాస్యంతో కూడిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను అందించింది.
We’re all set to take you on a thrilling ride. #MathuVadalara gets U/A. End 2019 with a Bang in Theatres near you from Dec 25th 😎
@Kaalabhairava7 @Simhakoduri2302 @RiteshRana @Clapentrtmnt#MathuVadalaraOnDec25th pic.twitter.com/7THHoD5dIY— Mythri Movie Makers (@MythriOfficial) December 19, 2019
ఇంకా ఈ సినిమాలో నరేష్ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. కీరవాణి తనయుడు బాహుబలి2, అరవింద సమేత మూవీస్ హిట్ సాంగ్స్ పాడిన కాలభైరవ మత్తువదలరా మూవీతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ .. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: