అన్నకు అతిథిగా తమ్ముడు..!

Jr NTR To Grace Kalyan Ram Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Entha Manchivaadavuraa Movie Updates,Entha Manchivaadavuraa Telugu Movie Latest News,Entha Manchivaadavuraa Movie Pre Release Event Chief Guest,Entha Manchivaadavuraa Telugu Movie Pre Release Event Chief Guest

‘118’ ఘనవిజయం తర్వాత సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది. ఈ నేపథ్యంలో జనవరి 5వ తేదీనగానీ .. 6వ తేదీనగాని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. అంతేకాదు ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కళ్యాణ్ రామ్ సినిమాల ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుండగా..ఇంకా తనికెళ్ళ భరణి, విజయ్ కుమార్, నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =