కమల్ హాసన్ కు సర్జరీ – కొద్దిరోజులు బ్రేక్..!

Kamal Haasan To Undergo Surgery,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Kamal Haasan to Undergo Surgical Procedure,Kamal Haasan Surgery,Kamal Haasan to Undergo Leg Surgery,Kamal Haasan Latest News 2019

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2’ ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

ఇదిలా ఉండగా కమల్ హాసన్ ఓ శస్త్రచికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరనున్నారు. ఈ విషయాన్ని పార్టీ తరపున ఓ లేఖ ద్వారా తెలిపారు. కమల్ కు శుక్రవారం నాడు వైద్యులు శస్త్ర నిర్వహించనున్నారు. 2016లో ఆయన ఓ ప్రమాదానికి గురికాగా, కాలులో ఇంప్లాంట్ ను డాక్టర్లు అమర్చారని… ఇప్పుడు దాన్ని మరో సర్జరీ చేసి తీయనున్నారని.. ఆపరేషన్ తరువాత ఆయన కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారని.. ఈ శస్త్రచికిత్స గతంలోనే జరగాల్సి వుందని, అయితే పార్టీ కార్యకలాపాల కారణంగా వాయిదా పడుతూ వచ్చిందని పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్ మహేంద్రన్ వెల్లడించారు.

మరి దీన్నిబట్టి చూస్తుంటే భారతీయుడు2 షూటింగ్ కు మరోసారి బ్రేక్ పడేలా కనిపిస్తుంది. లేదంటే.. ఇతర నటీనటులతో షూటింగ్ కానిచ్చేసి.. కమల్ తో తర్వాత షూట్ చేస్తాడేమో శంకర్..

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here