ధనుష్ ‘అసురన్’ 50 రోజులు పూర్తి – కెరీర్ బెస్ట్ మూవీ..!

Dhanush Asuran Completes 50 Days,Asuran Creates Record For Dhanush, Asuran Movie Box Office Collections, Asuran Movie Collections, Asuran Movie Completes 50 Days, Asuran Movie Latest News, Asuran Movie Updates, Asuran Movie Worldwide Collections, latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

వెట్రిమారన్, ధనుష్ కాంబినేషన్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా ఇటీవల వచ్చిన మరో సినిమా ‘అసురన్’. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. కుల వివక్ష, భూ హక్కుల గురించి చాలా బాగా చూపించారు. ధనుష్ మరోసారి తన నటనతో సినిమాను విజయ తీరాలకు చేర్చాడు. చేతగాని తండ్రిలా, తలొగ్గి బతికే మామూలు మనిషిగా జీవనం సాగించే పాత్రల్లో ధనుష్ జీవించేశాడు. ఇక విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న ఈ సినిమా తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ రోజుల్లో ఒక సినిమా రెండు వారాలు ఆడటమే ఎక్కువ. అలాంటిది 50 రోజులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుందంటే గొప్ప విషయమే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి కూడా తెలిసిందే. ఇందులో హీరోగా వెంకటేష్ నటిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ రీమేక్ కి దర్శకత్వం ఎవరు వహిస్తారంటూ.. గత కొద్దిరోజుల నుంచి కొంతమంది దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చాయి. హను రాఘవపూడి , తరుణ్ భాస్కర్, ఓంకార్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి..వారందరినీ పక్కనబెట్టి సురేష్ బాబు ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ గా పేరుపొందిన శ్రీకాంత్ అడ్డాలను దర్శకుడిగా ఫైనలైజ్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ రేంజ్ లో.. అంత సహజత్వంగా సినిమా తీయాలంటే కాస్త కష్టంతో కూడుకున్న పనేకదా. అందుకే డైరెక్టర్ విషయంలో అంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − five =