‘ఖైదీ’- స్టైలీష్ మాస్‌యాక్షన్ థ్రిల్లర్

Khaidi Stylish Mass Action Thriller Says Karthi,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019,Telugu Filmnagar, Tollywood Cinema News,Karthi Stylish Mass Action Thriller Khaidi,Karthi New Movie Khaidi,Karthi Latest News 2019

‘మా న‌గ‌రం’ ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను… తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్ స‌మ‌ర్పిస్తున్నారు.ఇక ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 25నప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్ జెఆర్‌సి కన్వెన్షన్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్‌ను ఏర్పాటు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మాటల రచయిత రాకేంద్ర మౌళి మాట్లాడుతూ – “ఖైదీ ఒక యాక్షన్ థ్రిల్లర్, కానీ ఈ సినిమాలో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కోషంట్ ఉంది. అదే ఆ ఖైదీ క్యారెక్టర్ తాలూకు డ్రైవింగ్ ఫోర్స్. ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కి ఒకే ఆర్క్, పర్పస్, క్లోజర్ ఉంటుంది. మెయిన్ గా ఈ సినిమా ఒకే ఒక రాత్రిలో జరుగుతుంది. హీరోయిన్, పాటలు లేకున్నా ఈ కథను అద్భుతంగా ప్రజెంట్ చేసిన లోకేష్ కనకరాజ్‌ని కచ్చితంగా అభినందించి తీరాలి. ప్రతి క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రతి సీన్, ప్రతి ఎపిసోడ్ స్ట్రాంగ్ గా రాయబడినది. 2-20 నిముషాలు ఎడ్జ్ ఆఫ్ సీట్ ఎక్సపీరియన్స్ ఇస్తుంది. నేను కార్తీ అన్న ‘ఆవారా’ సినిమాకి పాటల రచయితగా పరిచయం అయ్యాను. మళ్ళీ ఇప్పుడు ఆయన సినిమాకే మాటలు రాయడం హ్యాపీ ” అన్నారు.

నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ – “కార్తీ ప్రతి సినిమా తెలుగు ప్రజలకి చాలా దగ్గరగా వెళ్ళింది. తమిళ్‌తో సమానంగా తెలుగులో కూడా పాపులర్ అయిన హీరో కార్తీ. ఖైదీ పేరుతో వ‌చ్చిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఫిలిం ఛాంబ‌ర్ మాజీ అధ్య‌క్షుడు పూర్వి రాజు మాట్లాడుతూ – “టీమ్ అందరికీ ఈ దీపావళికి పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత ఠాగూర్ మ‌ధు మాట్లాడుతూ – ‘టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్’ అన్నారు.

నటుడు నరైన్ మాట్లాడుతూ – “ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీలో ఒకటైన తెలుగు పరిశ్రమకి నేను పరిచయం అవడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉంటానికి ముగ్గురు వ్యక్తులు కారణం కార్తీ, ఎస్ ఆర్ ప్రభు, లోకేష్. తెలుగులో ‘ఖైదీ’ లాంటి సినిమా రావడానికి ఇది కరెక్ట్ టైమ్. ఈ సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్‌గా నటించాను. సినిమా తప్పకుండా బిగ్ హిట్ అవుతుంది” అన్నారు.

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ అధినేత ఎస్ ఆర్ ప్రభు మాట్లాడుతూ – ” ఈ సినిమా చేసినందుకు కార్తీ గారికి అలాగే ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న రాధామోహన్ గారికి ధన్యవాదాలు. మా మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన అడివిశేష్ గారికి స్పెష‌ల్ థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారు. అందరికీ అడ్వాన్స్ గా దీపావళి శుభాకాంక్షలు” అన్నారు.

శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ – “బెంగాల్ టైగర్’, ‘పంతం’ మూవీస్‌తో నాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాతో ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఇదొక కొత్త తరహా సినిమా. ప్రస్తుతం ఆడియన్స్ సినిమాల్లో చేంజ్ కావాలి అనుకుంటున్నారు అలాంటిచేంజ్ఉన్న సినిమా. మేము ముందే చెప్పినట్టు ఈ సినిమాలో రొమాన్స్, సాంగ్స్ లేవు కానీ కానీ రెండు గంటల ఇరవై నిముషాలు మిమ్మల్ని థియేటర్స్ లో కట్టిపడేస్తుంది. ఫాదర్, డాటర్ సెంటిమెంట్ చాలా బాగా ఉంటుంది. అందరూ ఈ సినిమాని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

హీరో అడివి శేష్ మాట్లాడుతూ – “ఆవారా’ సినిమాకు నేను బ్లాక్ టికెట్ కొనుక్కొని చూశాను. ట్రైలర్ నచ్చి ట్వీట్ చేయడం, ఇక్కడికి రావడం జరిగింది. నేను కార్తీ సినిమాలకు పెద్ద ఫ్యాన్ ని. మీ అందరితో పాటు నేను అక్టోబర్ 25న థియేటర్స్ లో సినిమా చూస్తాను” అన్నారు.

యాంగ్రీ హీరో కార్తీ మాట్లాడుతూ – “ఖాకి’ సినిమాను మీరు బాగా ఆదరించారు, నేను కొత్త ప్రయోగాలు చేయడానికి ఆ సినిమా ఒక అడ్రెస్ అయిపోయింది. ఆ సినిమా తర్వాత వస్తోన్న ఆలాంటి మరొక ‘రా’ సినిమా ‘ఖైదీ’. కనకరాజ్ గారు ఈ సినిమాకు ముందు నగరం సినిమా చేశారు. ఈ కథ చెప్పేటప్పుడే ఇదొక కొత్త ఐడియా డెఫినెట్ గా మీకు నచ్చుతుంది ఒకసారి చిన్న లైన్ చెప్తాను వినండి అన్నారు. విన్న తర్వాత ఒక పెద్ద హాలీవుడ్ యాక్షన్ ఫిలింలా అనిపించింది. వాళ్లు ఊహించిన దాని కంటే బిగ్ హిట్ అవుతుంది అనిపించి ఓకే అన్నాను. ఈ సినిమాలో హీరోయిన్ లేదు, పాటలు లేవు, కామిడీ ట్రాక్ కూడా లేదు అన్నారు అదే ఈ సినిమాకు పెద్ద పబ్లిసిటీ అవబోతుంది మీరు చూడండి అన్నాను. ఈ సినిమా ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది ముఖ్యంగా లారీ మీద లైవ్ యాక్షన్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. అంతా యంగ్ టీమ్ తో డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించారు. చాలా కాలం తర్వాత అడివిశేష్ గారిని కలిశాను. మా ఇద్దరిది దాదాపు ఒకే రకమైన జర్నీ. ఇద్దరికి ఇలాంటి సినిమాలంటే ఇష్టం. ఇది కేవలం యాక్షన్ మూవీ కాదు, ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది, పది సంవత్సరాల జైలు జీవితం ముగించుకొని బైటికి వచ్చే ఒక ‘ఖైదీ’. అతనికి తను ఇప్పటివరకూ చూడని ఒక కూతురు ఉంటుంది. ఒక రాత్రిలో నాలుగు గంటల్లో జరిగే స్టోరీ. ఈ నాలుగు గంటల్లో ఆ అమ్మాయి మొహం చూడగలిగాడా? లేదా ? అనేది మూవీ. ఇదొక మాస్ స్టైలిష్ యాక్షన్ ఫిలిం. ఇంత పెద్ద టైటిల్ నాకు దొరకడమే చాలా అదృష్టం. టైటిల్‌కి తగ్గట్టు సినిమా కూడా ఉంటుంది. అక్టోబర్25 మూవీ రిలీజ్ అవుతుంది. ఇలాంటి మూవీకి మీ ఫ్యాన్స్ సపోర్ట్ చాలా అవసరం. మీ ఫీడ్ బ్యాక్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అన్నారు.

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సి.ఎస్‌., సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌, ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌, మాటలు: రాకేంద్ర మౌళి, తెలుగు రాష్ట్రాల్లోసమర్పణ : శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌, దర్శకత్వం: లోకేష్‌ కనకరాజ్‌.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =