రెబల్ స్టార్ కృష్ణంరాజు 100వ చిత్రం ‘రంగూన్ రౌడీ’కు 40 ఏళ్ళు

40 Years For Krishnam Raju 100th Movie Rangoon Rowdy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rangoon Rowdy Movie Updates,Rangoon Rowdy Telugu Movie Latest News,Rangoon Rowdy Movie Completes 40 Years,#RangoonRowdy

రెబల్ స్టార్ కృష్ణంరాజు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్‌లో పలు విజ‌య‌వంత‌మైన‌ చిత్రాలు రూపొందాయి. వాటిలో ‘రంగూన్ రౌడీ’ ఒకటి. ‘కటకటాల రుద్రయ్య’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత కృష్ణంరాజు, దాసరి కలయికలో వచ్చిన సినిమా ఇది. మోసగాడైన ఓ తండ్రికి అతని ఇద్దరు కొడుకులు ఏ విధంగా బుద్ధి చెప్పారన్నదే ‘రంగూన్ రౌడీ’ చిత్ర కథ. అన్నదమ్ములుగా కృష్ణంరాజు, మోహన్ బాబు నటించగా… వారికి జోడిగా జయప్రద, దీప కనిపించారు. రావు గోపాలరావు, ప్రభాకరరెడ్డి, గోకిన రామారావు, రావికొండలరావు, ధూళిపాల, ‘షావుకారు’ జానకి మ‌రియు మహానటి సావిత్రి ఇతర ముఖ్య భూమికలు పోషించారు. ఇక చిన్న‌ప్ప‌టి కృష్ణంరాజు పాత్ర‌లో ప్ర‌ముఖ‌ నేపథ్య గాయకుడు మనో దర్శనమిచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జె.వి.రాఘవులు స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా హిందీ ఫిల్మ్ ‘ముకద్దర్ కా సికందర్’ లోని “ఓ సాథి రే” పాట స్పూర్తితో రూపొందిన… “ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం” అనే పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే “వానొచ్చే వరదొచ్చే”, “అదరహో అదరహా” వంటి పాటలు కూడా అలరించాయి. విజయ మాధవి కంబైన్స్ పతాకంపై వడ్డే రమేష్ నిర్వ‌హ‌ణ‌లో వడ్డే శోభ‌నాద్రి నిర్మించిన ‘రంగూన్ రౌడీ’… కృష్ణంరాజు కెరీర్‌లో 100వ చిత్రం కావడం విశేషం. అంతేకాదు… బ‌ర్మాలో చిత్రీక‌రణ జ‌రుపుకున్న తొలి భారతీయ చిత్రం కూడా ఇదే కావ‌డం విశేషం. 1979 సెప్టెంబర్ 28న విడుదలై ఘ‌న విజ‌యం సాధించిన ‘రంగూన్ రౌడీ’… నేటితో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 4 =