మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇదిలా ఉంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన కథనం ఫిలిమ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే… ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ త్రిష ఓ కథానాయికగా ఎంపికైందని సమాచారం. ఇప్పటికే `స్టాలిన్` (2006) చిత్రంలో చిరుకి జోడీగా నటించిన త్రిష… మళ్ళీ 13 ఏళ్ళ తరువాత మెగాస్టార్‌తో జట్టుకట్టనుండడం విశేషం. త్వరలోనే త్రిష ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా… కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… అక్టోబర్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























