సినిమా హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు యాంగ్రీ హీరో రాజశేఖర్. ఇటీవలే సస్పెన్స్ థ్రిల్లర్ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ శేఖర్.. ఎప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో రాబోతున్నాడు. క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై జి. ధనుంజయన్ నిర్మాణంలో రాజశేఖర్ ఓ సినిమాకు కమిటయినట్టు గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు డైరెక్టర్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కిస్తున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా…అక్టోబర్‌లో సినిమా షూటింగ్ మొదలు కానుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘కథ చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే బాగా కుదిరింది. కథనం ఉత్కంఠభరితంగా, అదే సమయంలో ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కథ విన్న వెంటనే ఓకే చేసేశా. స్క్రీన్ ప్లే నచ్చి వెంటనే ‘ఎస్’ చెప్పాను… అంత ఎగ్జయిటింగ్‌గా స్క్రీన్ ప్లే ఉంటుంది’’ అని అన్నారు.
ఇంకా ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం, సంపత్ నటించనున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.పి. శివప్రసాద్, ఫైనాన్షియల్ కంట్రోలర్: సి.ఎ.జి. గోకుల్, పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి, రైటర్: విశ్వ వేమూరి, స్ర్కీన్‌ప్లే: జాన్ మహేంద్రన్, సంగీతం: సైమన్ కె. కింగ్, నిర్మాత: జి. ధనుంజయన్, దర్శకత్వం: ప్రదీప్ కృష్ణమూర్తి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: