సామాజిక కథాంశంతో సాయి తేజ్, దేవ కట్టా సినిమా

2019 Latest Telugu Film News, Interesting Update About Sai Dharam Tej And Deva Katta Movie, Interesting Update About Sai Dharam Tej Next Movie, Sai Dharam Next Project Details, Sai Dharam Tej And Deva Katta Movie Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

‘ప్ర‌స్థానం’ (2010)తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు దేవ క‌ట్టా. ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. కట్ చేస్తే… తాజాగా అదే చిత్రాన్ని హిందీలోనూ ‘ప్రస్థానం’ పేరుతోనే రీమేక్ చేసాడు దేవ. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ డ్రామా ఈ నెల(సెప్టెంబర్) 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… దేవ కట్టా తన తదుపరి చిత్రాన్ని మెగా హీరో సాయి తేజ్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్ కి ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ని సెట్ చేసుకున్నాడట దేవ.

‘ ఎవరైతే తొలిగా బాట వేయాలనుకుంటారో… వాళ్లు రక్తం చిందించాల్సి ఉంటుంది’ అనే పాయింట్ తో… సామాజిక బాధ్యతను గుర్తుచేసే ఈ విధంగా ఈ సినిమా కథాంశం ఉంటుందట. అంతేకాదు… దేశ అభివృద్ధికి నిరోధకాలైన లంచం, అవినీతి వంటి అంశాల‌ను కూడా ఇందులో ట‌చ్ చేశారని టాక్. అలాగే… సీరియస్‌గా సాగే ఈ కథలో… క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ కూడా చాలా తక్కువ‌గానే ఉంటాయ‌ని అంటున్నారు. భారీ తారాగణంతో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి… మరిన్ని వివ‌రాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =