‘సరిలేరు నీకెవ్వరు’…. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా… లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్‌లో ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో మహేష్, కొంతమంది ఫైటర్లపై పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ నెల 12 వరకు సాగే ఈ షెడ్యూల్‌లో విజయశాంతి కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
రామబ్రహ్మం సుంకర, `దిల్` రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న `సరిలేరు నీకెవ్వరు`కు… దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. 2020 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: