భారతీయ సంస్కృతి, మానవతా విలువలకు పెద్ద పీట వేస్తూ… భారతీయ యవనికపై పలు కుటుంబ కథా చిత్రాలు సందడి చేసాయి. వాటిలో హిందీ చిత్రం ‘హమ్ ఆప్కే హైన్ కౌన్’ ఒకటి. మ్యూజికల్ సెన్సేషన్‌గా నిలచిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించగా… మొహ్నీష్ బేల్, రేణుకా సహాని, అనుపమ్ ఖేర్, రీమా లాగూ, అలోక్ నాథ్, సతీష్ షా, బిందు తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. సూరజ్ బర్జత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రామ్ లక్ష్మణ్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీనులవిందైన సంగీతానికి అగ్ర తాంబూలమిచ్చే రాజశ్రీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో… లతా మంగేష్కర్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, కుమార్ సాను వంటి లెజెండరీ సింగర్స్ ఆలపించిన గీతాలు ఆల్‌టైమ్ సెన్సేషన్‌గా నిలిచాయి.
అలాగే రూ. బిలియన్ గ్రాస్‌ను ఆర్జించిన ఫస్ట్ ఇండియన్ ఫిలిమ్‌గా చరిత్ర సృష్టించడమే కాకుండా… సల్మాన్ కెరీర్‌ను మలుపుతిప్పి సూపర్ స్టార్ హోదాను అందించిన చిత్రంగానూ ‘హమ్ ఆప్కే హైన్ కౌన్’కి ప్రత్యేక స్థానముంది. ఇక తెలుగులో ‘ప్రేమాలయం’ పేరుతో అనువాదమై… ఇక్కడా వసూళ్ళ వర్షం కురిపించింది. 1994 ఆగస్టు 5న విడుదలై ఘన విజయం సాధించిన ‘హమ్ ఆప్కే హైన్ కౌన్’… నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[youtube_video videoid=R9pBspUbRXE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: