ఎ.ఆర్.రెహమాన్… భారతీయ సంగీత ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. ఈ మ్యూజిక్ జీనియస్ స్వరసారథ్యంలో రూపొందిన పలు గీతాలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. కాగా… ఇన్నాళ్ళు తెర వెనుక సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలచిన ఈ డబుల్ ఆస్కార్ అవార్డ్ విన్నర్… ఇప్పుడు తొలిసారి వెండితెరపై కూడా దర్శనమివ్వబోతున్నాడని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… కోలీవుడ్ స్టార్ విజయ్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా అట్లీ కుమార్ దర్శకత్వంలో ‘బిగిల్’ అనే తమిళ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి స్వరాలు సమకూరుస్తున్న రెహమాన్… ఇందులో అతిథిగానూ కాసేపు ప్రేక్షకులను అలరించనున్నాడట. “సింగపెన్నే” అంటూ సాగే పాటలో హీరో విజయ్‌తో కలసి రెహమాన్ సందడి చేయనున్నాడని కోలీవుడ్ టాక్.
మరి… ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్‌లో దర్శనమిచ్చిన ఈ స్వర మాంత్రికుడు… తొలిసారి వెండితెరపై సందడి చేయనున్న వైనం ఆయన అభిమానులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. కాగా… దీపావళి కానుకగా ‘బిగిల్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=zc3JoINdSA4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: