ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూత

2019 Latest Telugu Film News, Director And Actor Devadas Kanakala no more,Director Devadas Kanakala, Director Devadas Kanakala No More, Actor Devadas Kanakala no more, Devadas Kanakala, Devadas Kanakala No More, Devadas Kanakala Passed Away, Devadas Kanakala Expired, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Rajiv Kanakala Father Expired
Director And Actor Devadas Kanakala no More

ఇప్పటివరకూ ఎంతోమంది సినీ ప్రముఖులను కోల్పోయిన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు మరో ప్రముఖ వ్యక్తిని కోల్పోయింది. ఆయన ఎవరో కాదు ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన తుదిశ్వాస విడిచారు. తన సతీమణి లక్ష్మీ కనకాల మృతి తరువాత మానసికంగా ఆయన చాలా దెబ్బతిన్నారు.

ఇక దేవదాస్ కనకాల 1945లో జూలై 30న యానంలో జన్మించారు. దేవదాసు స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. విశాఖపట్టణంలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు.

మొదట నటుడిగా వెండి తెరకు పరిచయమై పలు సినిమాల్లో నటించారు. పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆ తరువాత యాక్టింగ్ స్కూల్ ని ఏర్పాటు చేశారు. ఆయన దగ్గర నటన నేర్చుకున్న ఎంతోమంది ఆ తరువాత కాలంలో స్టార్స్ గా వెండితెరను ఏలేశారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి నటులతో పాటు ఇంకా చాలా మంది ఆయన నట పాఠశాలలో శిక్షణ తీసుకున్న వాళ్లే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=8KwZW-wH0PI]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here