కాంటెంపరరీ ఇష్యూ మీద తీసిన కంటెంట్ వెయిట్ ఉన్న సినిమా గుణ 369

Guna 369 Movie Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Latest Telugu Movie Reviews,2019 Telugu New Movie Reviews,Guna 369 Review,Guna 369 Telugu Movie Review,Guna 369 Movie Story,Guna 369 Telugu Movie Live Updates,Guna 369 Movie Public Talk,Guna 369 Telugu Movie Public Response,Guna 369 Movie Rating,Guna 369 Telugu Movie Review And Rating,Guna 369 Movie Mouth Talk

కాంటెంపరరీ సొసైటీలో బాగా నలుగుతున్న, బాగా చర్చనీయాంశం అవుతున్న సమస్యను కథాంశంగా తీసుకుని కమర్షియల్ హంగులు జోడించి పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని గతంలో చాలా చిత్రాలు నిరూపించాయి. ముఖ్యంగా ముక్కుపచ్చలారని పసిపిల్లల మీద, అమాయక ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి ,  సెల్ ఫోన్స్ లో చిత్రీకరించి, ఆపై ఘోరంగా హత్యలు చేసే పైశాచిక ప్రవృత్తి ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఇలాంటి దుర్మార్గులను నట్ట నడి రోడ్డు మీద నరికి పడేయాలి అనే కసి,ఉక్రోషం ప్రతి సామాన్యుడిలో పెల్లుబుకుతుంటాయి.  తమ తరఫున ఒక సామాన్యుడు అలాంటి దుర్మార్గులను నరికి పోగులు పెడుతుంటే ఎలా ఉంటుందో చూడాలనే కసే కథాంశం అయితే ఖచ్చితంగా అలాంటి కాంటెంపరరీ కథాంశంతో రూపొందిన చిత్రమే
“గుణ 369″.

ఈ మధ్యకాలంలో  ఆసేతు హిమాచల పర్యంతం కొవ్వెక్కి కొట్టుకుంటున్న కొడుకులు ఆడపిల్లల మీద ఎలాంటి అత్యాచారాలకు పాల్పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. అలాంటి అత్యాచార కథాంశాన్ని చెప్పటం కోసం గుణ 369 దర్శకుడు అర్జున్ జంధ్యాల ఎన్నుకున్న నేపథ్యం చాలా వైవిధ్యంగా  ఉంది. ఇంతకూ ” గుణ 369 ఎలా ఉందో ….. దర్శకుడు అర్జున్ ఎలా డీల్ చేసాడో రివ్యూ లో చూద్దాం.

గుణ( కార్తికేయ) కాలనీ గుడ్ బాయ్. నరేష్ , హేమ తల్లిదండ్రులు. కాలనీలో అందరికీ చేదోడువాదోడుగా ఉంటాడు. అదే కాలనీకి కొత్తగా వచ్చిన గీత (అనఘ) ను ఇష్టపడతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ ఊరిలో గద్దలగుంట రాధా( ఆదిత్య) ఒక పెద్ద గుండా. ఒక సందర్భంలో రాధ మీద కొంతమంది కుర్రాళ్లు దాడి చేస్తారు. ఆ తర్వాత తాము దాడి చేసింది రాధ మీద అని తెలిసి క్షమాపణలు చెప్పి కాంప్రమైస్ చేయటానికి గుణ సహాయం కోరతారు. గుణ వాళ్లలో ఒకడిని తీసుకుని రాధా దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరమని అడుగుతాడు. వాడు క్షమాపణ చెప్పకపోగా ఎదురు తిరుగుతాడు.ఈ ఊహించని పరిణామంతో బిత్తరపోయిన గుణ ఏం చేశాడు? ఎదురుతిరిగిన వాడు , వాడి ముఠా సిటీనే గడగడలాడించిన రాధా ను ఏం చేశారు ? తన మాటలను నమ్మి వచ్చిన రాధాను రక్షించటం కోసం గుణ ఏం చేశాడు? అసలు ఆ ముఠా ఎవరు? ఒక మంచి కోసం ప్రయత్నించిన గుణ జీవితం నాశనం కావడానికి కారకులు ఎవరు? చివరకు గుణ వాళ్లకు విధించిన శిక్ష ఏమిటి ?

ఈ ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది “గుణ 369 “. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు అర్జున్ జంధ్యాల డీల్ చేసిన విధానంలో రెండు పార్శ్వాలు కనిపిస్తాయి. చిత్ర పరమార్థం చూస్తుంటే ఎవరో అనుభవం లేని కొత్త డైరెక్టరో, అనుభవం ఉన్నా అవకాశం రాని ఏ ప్రస్టేటెడ్ కో- డైరెక్టరో తీశాడు అనిపిస్తుంది. చాలా అమెచ్యూర్డ్ గా, హ్యాచ్- ప్యాచ్  గా అనిపిస్తుంది ఈ సినిమా ఫస్ట్  హాఫ్.ఇక   Once ఇంటర్వెల్ బ్యాంగ్ మొదలైన దగ్గర నుండి లాస్ట్ సీన్ దాకా సినిమాను ఊహించని మలుపులతో అద్భుతంగా తీసుకెళ్లాడు దర్శకుడు అర్జున్. ముఖ్యంగా కథలో మంచి కంటెంట్ వెయిట్ ఉండటంతో పాటు కాంటెంపరరీ ఇష్యూ కావటంతో పబ్లిక్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ చిత్రీకరణ సెన్సార్ పరంగా, విజువల్ సెన్సిటివిటీ పరంగా  చాలా ఘాటుగానే ఉన్నప్పటికీ “yes… ఇలాంటి రాక్షసులకు పడాల్సిన శిక్ష ఇదే కదా”-  అన్నంత కసి, కోపం ప్రేక్షకుడిలో రగలటం సహజం. అలాంటి natural anger ను ప్రేక్షకులలో రగిలించటంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు.

ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే- సినిమా మొత్తం తానుగా కనిపించేది కార్తికేయ. కండలు కొండల్లా పెంచుకున్నప్పటికీ మంచితనం,  అమాయకత్వం ఉట్టిపడే boy at the next door లాంటి గుణ క్యారెక్టర్లో కార్తికేయ ఇమిడిపోయాడు. అలాగే సెకండ్ హాఫ్ లో రగిలిపోయే ఆవేశంతో దుష్టశిక్షణ చేసే సందర్భంలో నటన పరంగా మంచి మెచ్యూరిటీ లెవెల్స్ కనపరిచాడు కార్తికేయ. ఇక పర్ఫార్మెన్స్ కు అవకాశం ఉన్న మరో పాత్ర ఆదిత్య పోషించిన గద్దలగుంట రాధ పాత్ర. నిజంగా ఆ పాత్రకు ఇచ్చిన బిల్డ్ అప్ కు  ఆదిత్య ఆకార అభినయాలకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ కుదిరింది.  కాస్టింగ్ పరంగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కు మహేష్ ను  సెలక్ట్ చేయటాన్ని ది బెస్ట్ సెలక్షన్ గా చెప్పుకోవాలి… ఎందుకు? ఏమిటి? అన్నది ధియేటర్ లో చూస్తేనే బాగుంటుంది.

ఇక టెక్నికల్ గా, మేకింగ్ స్టాండర్డ్స్ పరంగా కథను ప్రజెంట్ చేయటానికి అవసరమైన  రీజనబుల్ మేకింగ్ స్టాండర్డ్స్ కనిపిస్తాయి. నూతన నిర్మాతలు అనిల్, తిరుమల్ రెడ్డి, శ్రీమతి ప్రవీణ కడియాలతో పాటూ , డెబ్యూ డైరెక్టర్ అర్జున్ జంధ్యాలకు “గుణ 369” గుడ్ బిగినింగ్ అవుతుందనటంలో సందేహం లేదు.

గుణ 369 తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3.3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=TTH5LsU47So]

Summary
Review Date
Reviewed Item
గుణ 369 తెలుగు మూవీ రివ్యూ
Author Rating
41star1star1star1stargray

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here