ఎఫ్ 2
తో కామెడీ టైమింగ్‌లో తనకు తిరుగులేదని మరోసారి వెండితెర సాక్షిగా చాటాడు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం తను నటిస్తున్న మరో మల్టీస్టారర్ మూవీ వెంకీమామ
లో కూడా హ్యూమర్ టచ్ ఉన్న పాత్రనే చేస్తున్నాడు వెంకీ. అంతేకాదు.. ఈ సినిమా తరువాత చేయనున్న కొత్త చిత్రంలోనూ కామెడీకే పెద్ద పీట వేస్తున్నాడట ఈ సీనియర్ హీరో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. నేను లోకల్
ఫేమ్ త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో వెంకీ ఓ చిత్రం చేయబోతున్నట్లు చాన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం… ఈ ప్రాజెక్ట్‌లో కూడా వెంకీ చేస్తున్న పాత్ర కామెడీ టచ్‌తోనే సాగుతుందని సమాచారం. అదే గనున నిజమైతే… వరుసగా మూడోసార్లు హిలేరియస్ ఎంటర్‌టైనర్స్‌లో వెంకీ సందడి చేస్తున్నట్లే. ఏదేమైనా… ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
[subscribe]
[youtube_video videoid=hvS33iNEz5U]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)