RGV సంధించిన ప్రశ్నల బాణాలు

Lakshmi's NTR Press Meet Latest Updates,RGV Questions Government For Stopping His Press Meet,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RGV Questions To Government,RGV 16 Questions To Chandra Babu Naidu,RGV About His Lakshmi's NTR Press Meet
RGV Questions Government For Stopping His Press Meet

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం లో లక్ష్మీ పార్వతి కోణంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ మేడే రోజున ఆంధ్ర ప్రదేశ్ లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించడానికి విజయవాడ వెళ్ళిన RGV ని పోలీసులు అడ్డుకున్నారు. AP CM చంద్ర బాబు నాయుడు ను, విజయవాడ పోలీస్ ను RGV 16 ప్రశ్నలు అడిగారు. 16 గంటల లోగా జవాబు ఇవ్వకపోతే కోర్ట్ లో తేల్చుకుంటానని హెచ్చరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1.విజయవాడ ఎయిర్ పోర్ట్ నుండి సిటీకి వెళ్ళే సమయం లో తన కారు ఎందుకు ఆపారు ? పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు ?

2.విజయవాడ సిటీ లో ఎంటర్ అవకుండా హైదరాబాద్ తిరిగి పంపించాలని ఆర్డర్స్ ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఆ ఆర్డర్స్ ఎవరిచ్చారు ?

3. తాను బయటకు వెళ్ళకుండా, ఎవరూ కలవకుండా 7గంటల పాటు ఎయిర్ పోర్ట్ రూమ్ కు పరిమితి చేశారు,రీజన్ చెప్పండి ?

4. సెక్యూరిటీ కారణాల దృష్ట్యా ప్రెస్ మీట్ కు అనుమతి లేదని పోలీస్ నోటీస్ ఇచ్చారు. ఆ విషయం తనకు ఎందుకు వివరించలేదు ?

5. తన ఫ్రెండ్ ప్లేస్ లో ప్రెస్ మీట్ జరపాలనుకున్నాను , ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయిన తన ప్రాధమిక హక్కును పోలీస్ ఎందుకు అడ్డుకున్నారు ?

6.తాను రిక్వెస్ట్ చేసినా డిజిపి, సిపి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ?

7. తనను కస్టడీ లో తీసుకున్న పోలీసులు ఎవరు తనను అరెస్ట్ చేయమన్నారో చెప్పమంటే ఎందుకు చెప్పలేదు ?

8.ఇది స్వంత నిర్ణయమా ?సమిష్టి నిర్ణయమా ఎందుకు చెప్పలేదు ?

9.రాజకీయ నాయకుల ఉత్తర్వులతో పోలీసులు నడుచుకుంటున్నారా ?

10.డిజిపి, సిపి ఆ ఆర్డర్స్ ఇచ్చినందుకు సంజాయిషీ ?

11 . లా ప్రకారం ఒక మనిషి స్వాతంత్య్రయాన్ని ఏక పక్ష నిర్ణయం తో అడ్డుకొనకూడదు. సెక్యూరిటీ పేరుతో మానవ హక్కు, స్వాతంత్య్రం ,స్వేచ్ఛ భంగపరచడం ఏకారణంతో? ప్రతీ యాక్షన్ కు పోలీసులు, రాజకీయనాయకులు వివరించాలి, ఆలా ఎందుకు జరుగలేదు ?

12.రాజ్యాగపరంగా తాను ఏదీ ఉల్లంఘించలేదని, తనను అడ్డుకోవాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారు ?

13.విజయవాడ డీజిపి, సిపి ఎటువంటి పరిస్థితులలో నిర్ణయం తీసుకున్నారు ? వారే తీసుకున్నారా ?వేరే ఎవరైనా తీసుకున్నారా ?

14. ప్రభుత్వం చెప్పుచేతల్లో నడుస్తున్న పోలీస్ యంత్రాగం తనను ఎందుకు అడ్డుకున్నారో ?

15. ప్రజలకు ఏ ఇబ్బందీ కలగకుండా ఒక రూంలో జరిగేది ప్రెస్ మీట్ అని, ప్రెస్ మీట్ అడ్డుకునే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ?

16.ఆఖరి ప్రశ్న .. చంద్ర బాబు నాయుడు గారూ, ప్రజాస్వామ్య దేశంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వమా ? తన ప్రాధమిక హక్కు, స్వాతంత్య్రం, స్వేచ్ఛ నిర్దయగా అణిచివేసినందుకు, తనను పబ్లిక్ గా అవమానించినందుకు జవాబు కావాలని, మన ప్రజాస్వామ్య దేశం లో ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు జవాబుదారీ అని, విజయవాడ సిపి తిరుమల రావు, డీజిపి ఆర్ పి ఠాకూర్ సహేతు కారణాలతో వివరణ ఇవ్వాలని, ఈ దర్శ పౌరుడిగా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాననీ, నా ఈ ప్రశ్నలకు 16గంటలలోగా జవాబులు రాకపోతే కోర్టుకు వెళతానని, తన రాజ్యాంగ హక్కును కాపాడమని కోరుతానని రామ్ గోపాల్ వర్మ హెచ్చరించారు.

[subscribe]


[youtube_video videoid=NO1vrmNBqz4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 14 =