మాస్ పల్స్ తెల్సిన అతికొద్ది మంది దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకడు. యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నా… తన సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దిట్ట. భారీ కాస్టింగ్‌తో వెండితెరను కలర్ ఫుల్‌గా తీర్చిదిద్దడమే కాకుండా… యాక్షన్ ఎపిసోడ్స్‌ను కూడా కళ్ళు తిప్పుకోలేనంతగా రూపొందించగల టాలెంటెడ్ డైరెక్టర్. ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన బోయపాటి… ఆ తర్వాత ‘తులసి’, ‘సింహా’, ‘దమ్ము’, ‘లెజెండ్’, ‘సరైనోడు’ చిత్రాలతో టాలీవుడ్‌లో “వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్”గా ఎదిగాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రాల తర్వాత వచ్చిన ‘జయ జానకి రామ’, ‘వినయ విధేయ రామ’ కొంత నిరాశ పరిచినా… సక్సెస్ కోసం మళ్ళీ తనకి అచ్చొచ్చిన హీరో బాలకృష్ణతో ముచ్చటగా మూడోసారి జట్టు కట్టనున్నాడు. ‘లెజెండ్’(2014) సినిమాకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును, అలాగే… 2016కు గాను ప్రతిష్టాత్మక బి.ఎన్.రెడ్డి పురస్కారాన్ని కూడా తన సొంతం చేసుకున్నాడు బోయపాటి. బోయపాటి శ్రీను జన్మదినం సందర్భంగా ఆయన కెరీర్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం.
[subscribe]
[youtube_video videoid=ByfgzyESCjg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: