ఎన్నో సినిమాల పరాజయం తరువాత మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ కు చిత్రలహరి సినిమా తో మంచి విజయం దక్కింది. ఈనెల 12వ తేదీన విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈసినిమా జోరు కొనసాగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 20 కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా ముందు ముందు కూడా ఇదే కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ సినిమా సక్సెస్ పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి తేజ్ పై.. దర్శక నిర్మాతలపై ప్రశంసలు కురిపించారు. బంధాలు, అనుబంధాల గురించి ముఖ్యంగా తండ్రికొడుకుల మధ్య అనుబంధం గురించి డైరెక్టర్ చక్కగా చూపించారు.. దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు.. ఇక తేజు కూడా నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు.. మెచ్యూర్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో చాలా చక్కగా నటించాడు… పరిణితిని సాధించిన నటుడిగా నిరూపించుకున్నాడని ప్రశంసించారు. ఇప్పుడు చిన్నమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాపై స్పందించారు. సినిమా మంచి విజయం సాధించినందుకు చిత్రలహరి టీమ్ ను అభినందిస్తూ పుష్ప గుచ్చాలు పంపించారు.
కాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ కథానాయికలు కాగా ముఖ్య పాత్రలలో సునీల్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి నటించారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
[subscribe]
[youtube_video videoid=gIQHYdck5Dk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: