ఆర్ ఎక్స్ 100
తో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు అజయ్ భూపతి. పరిమిత బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమాని… యువతరానికి నచ్చేలా రూపొందించి సంచలన విజయం సాధించిన వైనం అప్పట్లో పరిశ్రమలో చర్చనీయాంశంగా నిలచింది. ఈ నేపథ్యంలో… అజయ్ తదుపరి చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ మధ్య పలువురు యువ కథానాయకుల కాంబినేషన్స్‌లో అజయ్ పేరు వినిపించినా… ఇప్పటివరకు తన రెండో చిత్రం పట్టాలెక్కలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే… తాజా సమాచారం ప్రకారం అజయ్ సెకండ్ ప్రాజెక్ట్… యువ సామ్రాట్ నాగచైతన్యతో ఉండొచ్చని సమాచారం. ఇప్పటికే ఈ ఇరువురి మధ్య చర్చలు కూడా జరిగాయని… త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రావచ్చని టాలీవుడ్ టాక్. అంతేకాదు… అన్నీ కుదిరితే ఈ సినిమాలో సమంత నాయికగా నటించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరి… ఈ కాంబినేషన్ కూడా వార్తలకే పరిమితం అవుతుందో లేక కార్యరూపం దాల్చుతుందో కాలమే నిర్ణయించాల్సి ఉంది.
[subscribe]
[youtube_video videoid=DNJDjoKXHYM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: