“పెళ్లికి ముందు ఉండే ప్రేమ… పెళ్లి తర్వాత బాధ్యతగా మారుతుంది” అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు… నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందీ చిత్రం. తెలుగునాట ఘన విజయం సాధించిన ఈ సినిమాను… ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు మాలీవుడ్‌లో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజా సమాచారం ప్రకారం… ‘మజిలీ’ హక్కుల కోసం ఓ తమిళ నిర్మాత ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే చైతు పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ ధనుష్‌ను సదరు నిర్మాత సంప్రదించనున్నాడని టాక్. ఈ సినిమాలోని ఎమోషన్స్ తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాయనీ… తమిళంలో కూడా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే… ధనుష్‌కి ‘మజిలీ’ స్క్రిప్ట్ నచ్చితే చేసే అవకాశం ఉందని కూడా ఈ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ప్రస్తుతం ధనుష్ ‘అసురన్’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. సదరు నిర్మాత హక్కులు సంపాదించి ధనుష్‌ని సంప్రదిస్తాడో, లేక ధనుష్‌ని సంప్రదించి రీమేక్ రైట్స్ సొంతం చేసుకుంటాడో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=rpeIYpLuiE0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: