సక్సెస్ ఫుల్ తమిళ హీరో విజయ్ సేతుపతి , చిరంజీవి హీరోగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ సేతుపతి మరో తెలుగు మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ను టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేస్తూ ఒక మూవీ ని రూపొందిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రూరల్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథ గా రూపొందనున్న ఈ మూవీ కి దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా మనీషా నటిస్తున్నారు. ఈ మూవీ ని విజువల్ ట్రీట్ గా తీర్చిదిద్దడానికి నిర్మాతలు టాప్ టెక్నీషియన్స్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్స్ గా రామకృష్ణ, మోనిక లను ఎంపిక చేశారు. ఈ మూవీ లో ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించడం విశేషం.
[youtube_video videoid=kYhrrzdx3zU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: