మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది మహర్షి చిత్ర యూనిట్. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు. గత కొద్ది రోజులుగా మహర్షి మూవీ రిలీజ్ పై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న మహర్షి రిలీజ్ అవుతుందని ఇంతకు ముందు ప్రచారం జరిగింది. దిల్ రాజు కూడా ఒక సందర్బంలో చెప్పడంలో అందరూ ఫిక్స్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే వారం రోజుల నుండి మహర్షి రిలీజ్ డేట్ మారిందంటూ వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ లేట్ అయ్యే అవకాశం ఉందని.. అందుకే రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు తాజాగా ఆ వార్తలన్నింటికీ బ్రేక్ వేశారు. మహర్షి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 9వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అఫీషియల్ గా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
కాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా, మహేష్ స్నేహితుడిగా కీలకమైన పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నాడు. ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుటుంది.
#Maharshi in theaters near you on May 9th 2019. #మహర్షిమే9నవిడుదల#MaharshiOnMay9th@urstrulyMahesh @directorvamshi@hegdepooja @allarinaresh @ThisIsDSP @kumohanan1
— Sri Venkateswara Creations (@SVC_official) March 6, 2019
#Maharshi Release Date Announcement… @urstrulyMahesh @directorvamshi@hegdepooja @allarinaresh @ThisIsDSP https://t.co/In1v17Q5lJ
— Sri Venkateswara Creations (@SVC_official) March 6, 2019
[youtube_video videoid=Brd1RdYsiR0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: