రకుల్ ప్రీత్ సింగ్… తెలుగు సినీ వినీలాకాశంలో తిరుగులేని తారలా దూసుకుపోతున్న ఈ తరం కథానాయిక. దాదాపు ఈ జనరేషన్ టాప్ హీరోలందరితోనూ కలసి నటించిన ఈ ఉత్తరాది భామ… ఇప్పుడు ఓ సీనియర్ హీరోతోనూ కలసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు… టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున. `మన్మథుడు` సీక్వెల్‌గా రూపొందుతున్న `మన్మథుడు 2`లో నాగ్‌కి జోడీగా నటించే అవకాశం రకుల్‌కి దక్కిందని టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో ఇద్దరు నాయికలకు స్థానముండగా… వారిలో ఒకరిగా రకుల్ నటిస్తోంది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా… పెర్‌ఫార్మెన్స్‌కు కూడా స్కోప్ ఉన్న పాత్ర ఇదని తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్… త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఇదివరకు నాగ్ నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌పై రూపొందిన `రారండోయ్ వేడుక చూద్దాం`లో నాగ్ తనయుడు నాగచైతన్యకి జోడీగా నటించి అలరించింది రకుల్. కట్ చేస్తే… రెండేళ్ళ తరువాత అదే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రంలో ఇప్పుడు నాగ్‌కి జంటగా నటిస్తుండడం విశేషం. మొత్తానికి… అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇలా తండ్రీకొడుకుల పక్కన జంటగా నటించే అరుదైన అవకాశాన్ని అందుకుందన్నమాట రకుల్. త్వరలోనే రకుల్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వస్తుంది. `
[youtube_video videoid=3Lzbtetf2Gc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























