అజిత్, శివ కాంబినేషన్ లో తెరకెక్కిన విశ్వాసం ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి పండుగ కానుకగా రిలీజైన ఈ సినిమా వసూళ్ల మోత మోగించి రికార్డులు క్రియేట్ చేసింది. తమిళ్ లో ఇప్పటికీ విశ్వాసం జోరు కొనసాగుతోంది. తమిళంలో ఈ సినిమా దాదాపు రూ.120 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇక తమిళంలో సూపర్ హిట్ కావడంతో ఈసినిమాను తెలుగు, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే తెలుగులో ఈ సినిమాను మార్చి 1 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కన్నడలో కూడా ఇదే రోజున రిలీజ్ చేయనున్నారు. కన్నడ వెర్షన్‌కు సంబంధించిన ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి తమిళ్ లో అంత ఘనవిజయం సాధించిన ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందో చూద్దాం.
కాగా ఈ సినిమాలో అజిత్ సరసన నయనతార హీరోయిన్ గా నటించగా.. జగపతి బాబు ప్రతినాయకుడిగా నటించాడు. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాకు ఇమ్మాన్ సంగీతం అందించాడు.
[youtube_video videoid=TiDyv53adt0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: